వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆన్‌లైన్‌ పెళ్లి మానేజ్‌మెంట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: సంప్రదాయ భారతీయ వివాహాలను ఆర్గనైజ్‌ చేయడం చిన్నవిషయం కాదు. అందుకే పెళ్లి చేసి చూడు ఇల్లుకట్టి చూడు అన్నారు. పెళ్లి చేయడంలో వున్న ఇబ్బందులను ఒక బటన్‌క్లిక్‌తో భుజానమోయడానికి వీలుగా షాదీఆన్‌లైన్‌డాట్‌ కామ్‌ అనే సంస్థ అవతరించింది. దేశీయులు మాత్రమే కాకుండా విదేశాల్లో వున్న భారతీయులు తమ పిల్లలకు పెళ్లి చేసేప్పుడు సంప్రదాయ తంతుల విషయంలో పట్టుదలగా వుంటారని ఈ డాట్‌కామ్‌ నిర్వాహకులు అంటున్నారు.

అయితే అన్ని జాగ్రత్తగా సమకూర్చి పెళ్లి అనుకున్నట్టుగా పూర్తిచేయడం తలనొప్పి వ్యవహారమని అంతా అంగీకరిస్తారని ఈ డాట్‌కామ్‌ను ప్రమోట్‌ చేసిన షానుసేన్‌ చెప్పారు. అనేకమంది నిపుణులతో అనేక రోజుల పాటు విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాత పెళ్లి మేనేజ్‌మెంట్‌లోకి తాము దిగామని ఆయన తెలిపారు. వధూవరులకు కావల్సిన పట్టువస్త్రాలు మొదలు పసుపుబియ్యం వరకు సంప్రదాయ వివాహానికి అవసరమైన సమస్తం సమకూర్చి పెళ్లివారికి ఏలాంటి భారం(ఫీజులు వుంటాయి) , బాధ్యత లేకుండా చూస్తామని వారు చెబుతున్నారు.

తమ సర్వీసులను పూర్తిగా ఉపయోగించుకోదల్చుకోని వారు పురోహితులకోసం, లేదంటే వివాహ యాజ్ఞికానికి కావల్సిన వస్తువులతో తయారు చేసిన ప్యాకేజీ కోసం కూడా తమను సంప్రదించవచ్చని ప్రమోటర్లు అంటున్నారు. కష్టం లేకుండా పెళ్లి చేయాలనుకునే వారు ముందుగానే రిజిస్టర్‌ చేసుకుంటే అనుకున్న ముహూర్తానికి వధూవరులను తీసుకుని వచ్చి మూడుముళ్లు వేయుంచుకుని విందారగించి వెళ్లిపోవచ్చు. ఇక ఖర్చుల విషయానికి వస్తే అయిదు లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చుకాగాల స్కీమ్‌లువున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X