వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటి ఎగుమతుల్లో భారీ వృద్ధి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ఐటి సాఫ్ట్‌వేర్‌, సర్వీసుల పరిశ్రమ అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 2000-2001 సంవత్సరంలో 55 శాతం మేర వృద్ధి చెందింది. ఈ ఏడాది ఐటి రంగం ఎగుమతుల మొత్తం 826 కోట్ల డాలర్లకు చేరుకున్నది. క్రితం ఏడాది ఎగుమతుల మొత్తం 620 కోట్ల డాలర్లు మాత్రమే. ఈ విషయం నాస్కామ్‌ ప్రకటించింది.

ఈ ఏడాది భారత ఐటి రంగం అమెరికాకు చేసే ఎగుమతులు కొద్దిమేర తగ్గే అవకాశం వున్నదని నాస్కామ్‌ పేర్కొంది. అమెరికాలో ఏర్పడిన మాంద్యం ప్రభావం 2001-2002 ఎగుమతులపై ప్రభావం చూపిస్తుందని ఈ ఏడాది ఎగుమతుల్లో వృద్ధి 35 శాతం మించివుండకపోవచ్చని నాస్కామ్‌ అభిప్రాయపడింది.

2000-2001లో భారత్‌ ఎగుమతుల రాబడి మొత్తం 4400 కోట్ల డాలర్లు వుండగా అందులో ఐటి రాబడి 14 శాతం వాటా ఆక్రమిస్తున్నదని నాస్కామ్‌ పేర్కొన్నది. ఎగుమతుల్లో వృద్ధి రేటుతో పోలీస్తే దేశీయ మార్కెట్‌లో ఐటి రంగం టర్నోవర్‌ గణనీయంగా పడిపోయింది. 1999-2000లో 45 శాతం వృద్ధి చూపిన దేశీయ మార్కెట్‌ ఆ తర్వాత ఏడాది 31 శాతానికి తగ్గింది. ఈ ఏడాది కూడా దాదాపు ఇదే స్థాయిలో వుండవచ్చని అంచనా వేస్తున్నారు.

గత ఏడాది భారత్‌ ప్రపంచవ్యాప్తంగా వున్న 102 దేశాలకు సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను, సర్వీసులను ఎగుమతి చేసింది. భారత్‌ ఎగుమతుల్లో ఒక్క అమెరికా, కెనడానే 62 శాతం వాటా ఆక్రమిస్తున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో యూరప్‌ (24 శాతం), జపాన్‌(4శాతం) వున్నాయి.
కాగా ఇండియా నుంచి సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో టాటా కన్సల్టెన్సీ, ఇన్పోసిస్‌ అగ్రస్థానంలో వున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ సంస్థ సత్యం నాలుగవ స్థానంలో వుంది.

  • ఆన్‌లైన్‌ పెళ్లి మానేజ్‌మెంట్‌
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X