బంగ్లాలో బాంబుపేలి 22 మంది దుర్మరణం
తీవ్రంగా గాయపడిన షమీమ్‌ను ఢాకా ఆస్పత్రికి తరలించారు. బాంబు పేలిన సమయంలో సమావేశంలో సుమారు 400 మంది వున్నట్టుగా పోలీసులు చెప్పారు. 12 మంది అక్కడికక్కడే మరణించారు. గత రెండేళ్లుగా బంగ్లాదేశ్‌ను కల్లోల పరుస్తున్న వరుస బాంబు పేలుళ్లలో ఇది తాజా సంఘటన
గోపాల్‌గంజ్‌లోని కాథలిక్ చర్చిలో పదిహేను రోజుల కింద జరిగిన బాంబు పేలుడులో 10 మంది మరణించిన సంఘటననుంచి బంగ్లా ప్రజలు తేరుకొనకముందే మరో బాంబుపేలుడు జరగడంతో భద్రతావ్యవస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు తలెత్తుతున్నాయి. తాజా సంఘటనతో ఢాకా దానిచుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారని పరిశీలకులు అంటున్నారు. శనివారం రాత్రి బాంబు పేలుడులో మృతుల సంఖ్య ఇంకాపెరిగే అవకాశం వుంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!