బిజెపిలో తెలంగాణా ముసలం
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణా సమస్య ఆంధ్రప్రదేశ్ బిజెపిలో తీవ్రమైన సంక్షోభాన్ని సృష్టిస్తున్నది. విశాఖపట్నంలో జరుగుతున్న బిజెపి కార్యవర్గ సమావేశాలను బహిష్కరించి హైదరాబాద్‌కు చేరుకున్న సీనియర్ నేత, మెదక్ ఎంపి నరేంద్ర ఈ నెల 22న తెలంగాణా డిమాండ్‌కు అనుకూలంగా వున్న బిజెపి నేతల సమావేశం ఏర్పాటు చేసినట్టుగా ప్రకటించారు.
ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను చర్చిస్తామని ఆయన వెల్లడించారు. కాగా తెలంగాణా విషయంలో తమ పార్టీ వైఖరి స్పష్టంగా వున్నదని ధిక్కరించిన నేతలపై కఠిన చర్యలు తప్పవని బిజెపి నాయకత్వం హెచ్చరిస్తున్నది. తెలంగాణా విషయంలో మొండివైఖరితో వున్న నేతల ప్రభావం పార్టీపై పెద్దగా లేదని వారు పార్టీనుంచి వెళ్లిపోయినా, వారిని పార్టీనుంచి బహిష్కరించినా వచ్చిన నష్టమేమీ లేదని బిజెపి నాయకత్వం అంటున్నది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!