వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్‌లో మరో ఐటి పార్క్
సింగపూర్: సింగపూర్‌కు చెందిన అసెండాస్ లాండ్ ఇంటర్నేషనల్ హైదరాబాద్‌లో ఇన్ఫోటెక్ పార్క్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలో వుంది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, చెన్నైలో కూడా ఐటి పార్క్‌లను ఏర్పాటు చేసే ప్రతిపాదన వున్నట్టుగా కంపెనీ వర్గాలు చెప్పాయి. బెంగుళూరులో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ టెక్నాలజీ పార్క్ రెండో దశ ఈ ఏడాది చివరికల్లా ప్రారంభం కాగలది కంపెనీ వర్గాలు చెప్పాయి.
ఇండియాలో ఈ ఏడాది మరో 4 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టుగా ఆ వర్గాలు చెప్పాయి. హైదరాబాద్‌లో ఐటి పార్క్ ఏర్పాటుకు సంబంధించి స్థానిక పారిశ్రామిక సంస్థతో చర్చలు దాదాపు తుదిదశలో వున్నట్టుగాచెబుతున్నారు. ఈ గ్రూప్‌తో జాయింట్ వెంచర్లో హైదరాబాద్ ఐటి పార్క్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో సింగపూర్ సంస్థవుంది.
ఆసియానే
పదిలమంటున్న
సత్యం
ఐకెఎఫ్
సాఫ్ట్
పేరు
మార్పు
Comments
Story first published: Friday, June 22, 2001, 23:53 [IST]