• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వచ్చే నెల 12,15తేదీల్లో స్ధానిక ఎన్నికలు

By Staff
|

హైదరాబాద్‌ : జులై 12, 15తేదీలలో జడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘంనిర్ణయించింది. రాష్ట్రంలోని 1,092 జడ్‌పిటిసి, 14,528 ఎంపిటిసిలకు ఎన్నికలుజరుగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నెల 25వ తేదీన జారీచేస్తారు. 12వ తేదీన 11 జిల్లాలలో, 15 వతేదీనమిగిలిన జిల్లాలలో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్‌ కాకిమాధవరావు తెలిపారు. ఈ సారి జిల్లాను యూనిట్‌గా తీసుకునిఒకే రోజు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. 25 తేదీననామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని, 30 తేదీననామినేషన్ల పరిశీలన, జులై 1న ఫిర్యాదులపరిశీలన, 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజున అభ్యర్ధుల ప్రకటన జరుగుతుందనిమాధవరావు తెలిపారు.

ఆ తర్వాత జులై 22వ తేదీనమండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు, 23వ తేదీన జిల్లా పరిషత్‌చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులకు పరోక్షపద్ధతిలో ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతేదీలు ఖరారు కావడంతో ఎన్నికల ప్రవర్తనానియమావళి శుక్రవారం నుంచే అమలులోకివచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీపంకింద గ్యాస్‌ కనెక్షన్లను పంపిణీ చేసే కార్యక్రమానికి బ్రేక్‌పడింది. అదే విధంగా దూరదర్శన్‌,ఆకాశవాణిల్లో ప్రజలతో ముఖ్యమంత్రి కార్యక్రమం ఎన్నికలుపూర్తయ్యే వరకు వుండదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X