వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంఫాల్‌లో కర్ఫ్యూసడలింపు

By Staff
|
Google Oneindia TeluguNews

ఇంఫాల్‌: మణిపూర్‌ రాజధానిఇంఫాల్‌లో అమలు చేస్తున్న కర్ఫ్యూను ఆరు గంటల పాటుసడలించారు. ఈ సమయంలో ఒక్కసారిగా ప్రజలువీధుల్లోకి వచ్చి పడ్డారు. నిత్యావసర సరకులను తీసికొనినిల్వ చేసుకోవడానికి వీలుగా శనివారం ఉదయంఐదు గంటల నుంచి ఆరు గంటల పాటు కర్ఫ్యూనుసడలించినట్లు అధికార వర్గాలు చెప్పాయి. తిరిగిఉదయం 11 గంటలకు కర్ఫ్యూను విధించారు.

రథయాత్రలో పాల్గొనడానికివీలుగా గోవింద్‌జీ దేవాలయం పరిసరాల్లో కర్ఫ్యూనుఎత్తివేయనున్నట్లు పోలీసు ఛీఫ్‌ సిద్ధిఖిచెప్పారు. ఏదో సాకుతో దుష్టశక్తులు హింసకు పాల్పడడానికిప్రయత్నిస్తున్నందున ఇంఫాల్‌ అంతటా కర్ఫ్యూ ఎత్తేసే సమస్యలేదని ఆయన అన్నారు. జగన్నాథ విగ్రహాన్నిఊరేగించే రథానికి శుక్రవారం రాత్రి కొందరుదుండగులు నిప్పంటించే ప్రయత్నంచేశారు. దుకాణాల వద్ద విపరీతమైన రద్దీఏర్పడింది. ప్రజలు దుకాణాలపై ఎగబడడంతోవ్యాపారులు సరకుల ధరలు రెండింతలు పెంచేశారు.హింస చెలరేగకుండా సైనిక, పోలీసు, పారమిలటరీ బలగాలు గస్తీ తిరుగుతున్నాయి.ఉద్రిక్తత ఉన్నప్పటికీ పరిస్థితి ప్రశాంతంగావున్నదని సిద్దిఖి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X