వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెనుకబడిన ప్రాంతాలకు బాబువరాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వెనుకబడిన ప్రాంతాలకుతెలుగుదేశం పార్టీ వరాల జల్లుకురిపించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రణాళికను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు శుక్రవారం పార్టీకార్యాలయం ఎన్టీఆర్‌ ట్రస్టు భవనంలో విడుదలచేశారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసంవచ్చే ఐదేళ్లలో 13,449 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామనిచంద్రబాబునాయుడు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వెనుకబడిన ప్రాంతాల సమగ్రఅభివృద్ధికి దృష్టి కేంద్రీకరించి పని చేస్తామనిఆయన అన్నారు. ప్రజలకు జవాబుదారీగా వుండేట్లు, ప్రజా సమస్యలను పరిష్కరించేట్లు స్థానిక సంస్థలనుతీర్చుదిద్దుతామని ఆయన అన్నారు. స్థానిక సంస్థలకుమరిన్ని అధికారాలు, నిధులు ఇస్తామని ఆయనచెప్పారు.

వచ్చే రెండేళ్లలో స్థానిక సంస్థలకు 1200 కోట్లరూపాయలు అందేలా చర్యలు తీసుకుంటామనిఆయన చెప్పారు. తెలంగాణాలోని అనేకప్రాంతాల్లో ఎన్నో పాఠశాలలు, వైద్య కళాశాలలు, ఇంజనీరింగ్‌ కళాశాలలు ఇచ్చామనిఆయన చెప్పారు. గ్రామాలకు మంచి నీటి సౌకర్యంకల్పించేందుకు, గ్రామాల్లో ఆరోగ్య పరిరక్షణకుచర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకుఅత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ఆయన అన్నారు.

సంస్కరణల ద్వారా విద్యుత్‌ కొరతను పూర్తిగా తీరుస్తామని కూడాఆయన చెప్పారు. వచ్చే ఏడాదికి రాష్ట్రం విద్యుదుత్పత్తిలోమిగులు సాధిస్తుందని ఆయన అన్నారు. పంచాయతీరాజ్‌ ఎన్నికలుముగిసిన తర్వాత కూడా నోడల్‌ అధికారుల వ్యవస్థ కొనసాగుతుందనిఆయన చెప్పారు.

గ్రామసభలకువిస్తృతాధికారులు సంక్రమింపజేయడానికిపంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరిస్తామని ముఖ్యమంత్రిచెప్పారు. రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలకు సంక్రమించినఅధికారాలను, విధులను, నిధులను దశలవారీగాబదలాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

నక్సలైట్ల చర్యలను కొన్నిరాజకీయ పార్టీలు సమర్థించడం శోచనీయమనిఆయన అన్నారు. తీవ్రవాదులు తెలుగుదేశం, బిజెపిలను మాత్రమేఎందుకు బ్యాన్‌ చేశారని ఆయన ప్రశ్నించారు. ఉచిత కరెంటు ఇస్తామనికాంగ్రెస్‌ ఓటర్లను మభ్య పెడుతోందని ఆయనవిమర్శించారు. ఇలాంటి హామీ ఇవ్వడం కాంగ్రెస్‌బాధ్యతారాహిత్యమేనని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X