వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియాంకకు అప్పుడే రాజకీయాలా?

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌ః తన కుమార్తె ప్రియాంక ఇప్పట్లో రాజకీయాల్లో ప్రవేశించే అవకాశాలు లేవని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించారు. అయితే భవిష్యత్తులో ప్రియాంక రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని ఆమె చెప్పారు. రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేది ప్రియాంక ఇష్టం అని వాషింగ్టన్‌ లోవిలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ సోనియా అన్నారు.

భారత రాజకీయాలను ఆకళింపు చేసుకొనేందుకు తన కుమారుడు రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రియాంక ఎప్పుడూ ఆసక్తి చూపుతారని ఆమెవివరించారు. క్రియాశీల రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేదిమీ ఇష్టం అని వారికి ఎప్పుడూ చెబుతూ వుంటాను. అయితే వారు ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేవని సోనియా స్పష్టం చేశారు. రాజకీయాల పట్ల ప్రియాంకు ఆసక్తి ఎక్కువని, ఆమెకు సమర్థురాలైన నాయకురాలిగా ఎదిగే లక్షణాలున్నాయని సోనియా అన్నారు. అమేథీలో తన ఎన్నికల ప్రచారం మొత్తాన్ని ప్రియాంక సొంతంగా నడిపించిందని ఆమెవివరించారు.

నన్ను రాజకీయాల్లో చేరమని నా భర్త ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. ఆ అంశాన్ని నా ఇష్టానికే వదిలేశారు. స్వతంత్ర వాతావరణంలో పెరిగిన రాహుల్‌, ప్రియాంక రాజకీయ రంగప్రవేశం గురించి వారే నిర్ణయం తీసుకుంటారని సోనియా అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X