• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్‌ కబుర్లు నమ్మకండిః బాబు

By Staff
|

కర్నూలుః రైతులకు ఉచితవిద్యుత్‌ ఇస్తానంటూ కాంగ్రెస్‌ పార్టీ చెప్పే కల్లబొల్లి కబుర్లు నమ్మవద్దని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజలనుకోరారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన కర్నూలు జిల్లా బనగానపల్లి బహిరంగసభలో ప్రసంగించారు. కాంగ్రెస్‌ అధికారంలో వున్న కర్నాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో రైతులకుఉచితంగావిద్యుత్‌ సరఫరా చేస్తే నేను కూడా మన రాష్ట్రంలో ఉచితంగావిద్యుత్‌ సరఫరా చేస్తానని చంద్రబాబు నాయుడు సవాల్‌విసిరారు. కేవలం ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కాంగ్రెస్‌ వారు ఇలా సాధ్యం కాని వాగ్దానాలు చేస్తున్నారని ఆయనవిమర్శించారు.

రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీకిఅసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టిన ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తమకువిజయం చేకూర్చాలని కోరారు. పంచాయతీ రాజ్‌ వ్యవస్థను పటిష్టం చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నదని ఆయన చెప్పారు. నిధులను దుర్వినియోగం చేసే స్థానిక సంస్థలకు, నేతలకు ప్రభుత్వం గుణపాఠం చెబుతుందని ఆయన ప్రకటించారు.

ఈ బహిరంగ సభలో రాష్ట్ర మంత్రులు బి.వి. మోహన్‌ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికలకు శనివారం తిరుపతి నుంచి చంద్రబాబు నాయుడు ప్రచారం ప్రారంభించగా, కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం మెదక్‌ నుంచి ప్రచారానికిశ్రీకారం చుట్టింది.

అధికారంలోకి వస్తే ఉచితవిద్యుత్‌ః వై.ఎస్‌

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more