• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

2-7-2001 సోమవారం

By Staff
|

హైదరాబాద్‌ః 26 జడ్‌.పి.టి.సి. స్థానాల్లో అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆ పార్టీ ప్రకటించింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం సాయంత్రంతో ముగియడంతో బరిలో ఎవరుమిగిలారనే విషయం నిర్ధరాణ అయింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఒకొక్క జడ్‌.పి.టి.సి. స్థానాన్ని అధికార తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగాకైవసం చేసుకుంది. ప్రకాశం జిల్లాలో తొమ్మిది ఎం.పి.టి.సి. స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
ఆంధ్రప్రదేశ్‌ లో ఈ నెల 12,15 తేదీల్లో జరిగే జడ్‌.పి.టి.సి., ఎం.పి.టి.సి. ఎన్నికల కోసం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారం సాయంత్ర ముగిసింది.

నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఏ స్థానాల్లో ఎవరెవరు బరిలో వున్నారనే అంశాన్ని ఎన్నికల సంఘం బుధవారం అధికారికంగా ప్రకటిస్తుంది. మంగళవారం సమావేశమైన రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలను సజావుగా నిర్వహించేందుకు గాను జిల్లాకు ఇద్దరు ఐ.ఎ.ఎస్‌. అధికారులను నియమించింది. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థల ఖర్చుపై అజమాయిషీ వుంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధ్యక్షుడు కాకి మాధవరావు మంగళవారం ఐ.ఎ.ఎస్‌ అధికారులతో జరిపిన సమావేశంలో కోరారు.

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం-బిజెపిలు ఉమ్మడిగా బరిలోకి దిగగా, కాంగ్రెస్‌-వామపక్షాలు చేతులు కలిపి అధికార పార్టీని ఓడించేందుకు సిద్ధమయ్యారు. మధ్యలో తెలంగాణా రాష్ట్ర సమితి రాజకీయ పార్టీగా వేళ్ళూనుకొనేందుకు స్థానిక ఎన్నికలను వేదికగా నిర్ణయించుకున్నది. పొత్తులు, సర్దుబాట్ల విషయంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు పలు స్థానాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇరు పక్షాలకు చెందిన ఆగ్రనేతలతో పాటు టిఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖర రావురాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు.

  • బాబు బండారంపైకాంగ్రెస్‌ క్యాసెట్‌
  • పొత్తు పొసగని చోట పోరు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X