• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జయకు వార్నింగ్‌ తో సరిపెట్టిన కేంద్రం

By Staff
|

న్యూఢిల్లీః ఇద్దరు కేంద్ర మంత్రులను రాజ్యాంగ నియమాలకువిరుద్ధంగా అరెస్టు చేసిన జయలలిత ప్రభుత్వాన్ని మందలించి వదిలేయాలని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. కేంద్ర మంత్రులనుఅరెస్టు చేసిన పోలీసుల అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జయలలిత ప్రభుత్వాన్ని అదేశించాలని మంగళవారం అత్యవసరంగా సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. అంతే కాకుండా రాజ్యాంగవిలువలను కాపాడడంతో ప్రభుత్వం విఫలంఅయిందంటూ జయలలితకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేయాలని నిర్ణయించింది.దీనితో తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధిస్తారనే ఊహాగానాలకు తెరపడ్డాయి.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు కరుణానిధిని జయ ప్రభుత్వంఅరెస్టు చేసిన తీరుతో దిమ్మెరపోయిన కేంద్ర ప్రభుత్వం మూడు రోజులుగా నానా హంగామా చేసింది. గవర్నర్‌ ఫాతిమా బీవిని రీకాల్‌ చేయాలని తీర్మానించి, ఆమే రాజీమానా చేయడంతో కాస్త చల్లబడింది. ఎన్డీఏ ప్రతినిధిగా ఫెర్నాండెజ్‌ ను తమిళనాడు పంపి నివేదిక తెప్పించుకుంది. ఆయన తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని నివేదిక సమర్పించారు.

అయితే అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా భాగస్వామ్య పార్టీల నుంచి వచ్చిన వ్యతిరేక సంకేతాల నేపధ్యంలో తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలనే
ఆలోచనకు కేంద్రం స్వస్తి చెప్పింది. గవర్నర్‌ ను వెనక్కు పిలిపించి జయకు షాక్‌ ఇచ్చిన కేంద్రం.... ప్రజాస్వామ్యవిలువలకు తమిళనాడులో ప్రమాదం వాటిల్లుతున్నదంటూ జయకు నేరుగా హెచ్చరిక జారీ చేయాలని సంకల్పించింది.

  • జైలు నుంచి విడుదలైన కేంద్రమంత్రి
  • తమిళ పోలీసులకు కోర్టు చీవాట్లు
  • బెయిలువద్దంటున్న కరుణానిధి
  • జయ ప్రభుత్వ రద్దుకుదేశం వ్యతిరేకం
  • రంగరాజన్‌ ప్రమాణస్వీకారం
  • కరుణను కలిసిన ఎర్రంనాయుడు
  • గురువాయురప్పకు ఏనుగునిచ్చిన జయ
  • తమిళనాడు బంద్‌ ప్రశాంతం
  • ప్రభుత్వంపై కఠిన చర్యకు జార్జి సిఫార్సు
  • ఫాతిమాపై వేటు-రంగరాజన్‌ కు బాధ్యతలు
  • రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన జయః జార్జి
  • నివేదిక పంపిన తమిళనాడు గవర్నర్‌
  • కరుణను పరామర్శించిన జార్జి
  • అట్టుడుకుతున్న తమిళనాడు
  • జయలలితపై వాజ్‌ పేయి గరం
  • జెలులో కరుణ సత్యాగ్రహం
  • కరుణానిధి అరెస్టుః జైలుకు తరలింపు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X