వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొత్తు పొసగని చోట పోరు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీతో పొత్తు పొసగకపోవడంతో సుమారు 150 జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేయాలని బిజెపి నిర్ణయించింది. ఇంతవరకు కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ రెండు పార్టీలు 85 నుంచి 90 స్థానాల్లో కలసి పోటీ చేస్తాయి. రాష్ట్రంలో మొత్తం 300 జెడ్‌పిటిసి స్థానాలకు బిజెపి నామినేషన్లు దాఖలు చేసింది.

పొత్తులో భాగంగా 165 స్థానాలను కేటాయించాలని తెలుగుదేశం పార్టీని కోరింది. కనీసం 120 స్థానాలకు సర్ధుకోవడానికి సిద్ధపడింది. అయినా తెలుగుదేశం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో బలమున్నదని అనుకుంటున్న ప్రాంతాల్లో సొంతగా పోటీకి దిగింది. కోస్తాలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బిజెపి ఒంటరిగానే బరిలోకి దిగింది.

రాయలసీమ జిల్లాల్లో కూడా అదే పరిస్థితి. తెలంగాణాలో సీట్ల సంఖ్యపై అవగాహన కుదిరినా ఎక్కడ ఎవరు పోటీ చేయాలనే దానిపై మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదు. మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువుముగుస్తున్నది. ఈ గడవు తర్వాత తెలంగాణా జిల్లాల్లో కూడా అదే పరిస్థితి వుంటుందని పరిశీలకులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X