వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముషారఫ్‌ తో భేటీపై అఖిలపక్షం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః పాకిస్తాన్‌ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ తో ఈ నెల 14న ఆగ్రాలో నిర్వహించే శిఖరాగ్ర సదస్సు గురించి చర్చించేందుకు ప్రధాని వాజ్‌ పేయి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సోమవారం జరిగే ఈ సమావేశంలో ముషారఫ్‌ తో చర్చించే అంశాలను ప్రధాని వాజ్‌ పేయి అన్ని పార్టీల రాజకీయ నేతలు, దేశ ప్రముఖలుతో చర్చిస్తారు.

ఈ అఖిల పక్ష సమావేశానికి పార్లమెంటులోని వివిధ రాజకీయ పార్టీల ప్రముఖలతో పాటు మాజీ ప్రధానులు పి.వి. నరసింహారావు, వి.పి. సింగ్‌, చంద్రశేఖర తదితర ప్రముఖులకు కూడా వాజ్‌ పేయి ఆహ్వానం పంపారు. మొత్తం 32 మంది ప్రముఖ నేతలు ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X