వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షార్‌ అడవిలో దావానలం

By Staff
|
Google Oneindia TeluguNews

నెల్లూరుః ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీహరి కోటలో వున్న షార్‌ అంతరిక్ష కేంద్రంలోని అడవి శుక్రవారం నుంచి తగలబడుతున్నది. శనివారం సాయంత్రం వరకు కూడా మంటలు తీవ్రరూపం ధరించాయి. రెండు చదరపు కిలోమీటర్లకుపైగా అడవి తగలబడినట్లు సమాచారం అందింది. ఆదివారం రాత్రి వరకు కూడా మంటలు అదుపులోకి రాలేదు.

షార్‌ లో వున్న ఫైరింజన్లు సరిపోక పోవడంతో తమిళనాడు, చిత్తూరు నుంచి 20 కిపైగా ఫైర్‌ ఇంజన్లు తెప్పించి మంటలను అదుపు చేస్తున్నారు. కీలకమైన లాంచిగ్‌ ప్యాడ్‌ లకు మంటలకు తాకకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈఅగ్ని ప్రమాదంలో అంతరిక్ష కేంద్రంలోని పరికరాలకు గానీ యంత్రాలకు గానీ ఎటువంటి నష్టం జరగలేదు. అయితే ముందు జాగ్రత్త చర్యగా కొన్ని కీలకమైన యంత్రాలను, పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X