వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శ్లోకాలు, వేదమంత్రాలతో డాట్‌కామ్
ముంబాయి: సనాతన భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వ సంపదను ప్రతిబింబిస్తూ డెవలప్ చేసిన శ్లోకాస్ డాట్ కామ్ పోర్టల్‌ను కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామివారు ఆవిష్కరించారు. ముంబాయికి చెందిన ప్రిజమ్ వెబ్‌టెక్ అనే కంపెనీ ఈ పోర్టల్‌ను డెవలప్ చేసింది.
కొంతమంది ప్రొఫెషనల్స్ సంయుక్తంగా ప్రమోట్ చేసిన ఈ ప్రజిమ్ వెబ్టెక్ను ఐసిఐసిఐఇ ఇన్ఫోటెక్ వెంచర్ ఆడియానర్చర్ ఇన్క్యూబెట్ చేసింది. టెక్నాలజీ, ఇన్ఫ్రా, నెట్వర్కింగ్, సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన అంశాల్లో శ్లోకాస్ డాట్ కామ్‌కు ఐడియానర్చర్ పూర్తిసహకారాన్ని అందజేసింది.
వేద మంత్రాలను, పురాణాలను, వేదోక్తమైన కర్మలను గురించిన సమాచారాన్ని, పురాణపురుషులు, రుషులు, గురువుల గురించిన వివరాలను ఈపోర్టల్‌లో పొందుపర్చినట్టుగా వెబ్టెక్వెల్లడించింది.
Comments
Story first published: Monday, July 9, 2001, 23:53 [IST]