• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పోలీసులపై నక్సల్స్‌గురి: ఇద్దరి మృతి

By Staff
|

అనంతపురం: అనంతపురం జిల్లా చెన్నే కొత్తపల్లి మండలంలో ఆదివారంనాడు రెండు చోట్ల మందుపాతరలు పేలి ఇద్దరు మరణించారు. ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌తో పాటు పలువురు గాయపడ్డారు.

చెన్నేకొత్తపల్లి మండలం గంగినేనిపల్లి, ఎరువోని పల్లి మధ్యలో మట్టి రోడ్డులో అమర్చిన మందుపాతరలు పేలి గంగినేపల్లికి చెందిన బోయన నరసింహులు, వీరశేఖర్‌ మరణించారు. మందుపాతరలు అమర్చడానికి వెళ్లినవారే చనిపోయి వుంటారని పోలీసులు భావిస్తున్నారు.

మరో మందు పేలుడు సంఘటనలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, మరి కొంత గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం ఎస్‌ఐ సద్గుణరావు, కానిస్టేబుల్‌ కేశప్ప, తదితరులు మోటార్‌ సైకిళ్లపై వెళ్తుండగా వెల్దుర్తి వద్ద మట్టిరోడ్డుపై మందుపాతరలు పేలి గాయపడ్డారు. వీరిలో కానిస్టేబుల్‌ ముత్యాలు పరిస్థితి ఆందోళనకరంగా వుంది. పోలీసులను కొండపై నుంచి గమనించిన నక్సలైట్లు మందుపాతరలు పేల్చి కాల్పులు జరిపారు. పోలీసులు వెంటనే తేరుకుని నక్సలైట్లపై కాల్పులు జరపగా వారు పరారయ్యారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more