• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నిండుగా వానలు, దండిగా పంటలు

By Staff
|

హైదరాబాద్‌: ఈ ఏడాది రాష్ట్రంలో నిండుగా వానలు కురుస్తాయని పాడి పంటలు పుష్కలంగా పండుతాయని ప్రకృతివైపరీత్యాల బెడద ప్రజలకు వుండదని సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు సందర్భంగా రంగం నిర్వహించిన శ్రీలత తన భవిష్యవాణిలో అభయమిచ్చింది.

అమ్మవారి ఆషాడ జాతర సందర్భంగా సోమవారం నాడు సంప్రదాయబద్దంగా రంగం కార్యక్రమం నిర్వహించారు. మాతంగేశ్వరి ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఈ రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. నూరుగురు అక్కాచెల్లెళ్లైన గ్రామదేవతలతో పాటు వారి సోదరుడైన పోతరాజును, మహంకాళి మాతను స్తుతించిన తర్వాత అమ్మవారు ఆవహించిన శ్రీలత, రంగం కోసం తయారు చేసిన వేదికపై ఉంచిన పచ్చికుండపై నిలబడి భవిష్యవాణిని వినిపించారు.

భక్తి ప్రపత్తులతో భక్తకోటి జరిపిన పూజలకు సంతసించానని, ప్రజలకు ఎటువంటి కష్టం కలగకుండా చల్లగా కాపాడుతానని రంగం ఎక్కిన శ్రీలతను ఆవహించిన అమ్మవారు అభయమిచ్చింది. వానలు, పంటల విషయంలో అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, వానలు సంతృప్తికరంగా కురుస్తాయని పంటలు మెండుగా పండుతాయని వెల్లడించింది. ప్రజలకు ప్రకృతి విపత్తులు వుండకుండా కాపాడుతానని చెప్పింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X