• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబుకు దయ్యంపట్టింది

By Staff
|

హైదరాబాద్‌: దేశం మొత్తంమ్మీద చంద్రబాబును మించిన మోసగాడు మరొకరు వుండరని పిసిసినేత సత్యనారాయణరావు దుయ్యబట్టారు.స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొని బుధవారం నాడు నగరానికి చేరుకున్న పిసిసి నేత సత్యనారాయణరావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

చంద్రబాబు జిత్తులమారి అన్న విషయం ప్రజలంతా గుర్తించారని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ మీద, కాంగ్రెస్‌ నాయకుల మీద చంద్రబాబు అన్ని రకాల మర్యాదలను అతిక్రమించి విమర్శలకు దిగడాన్ని ఆయన ఆక్షేపించారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే ఆయనకు దయ్యంపట్టిందా అనిపిస్తున్నదని సత్యనారాయణరావు అన్నారు. బహుశ నిస్పృహకారణంగా చంద్రబాబు ఈ రకమైన విమర్శలు చేస్తుండవచ్చని ఆయన పేర్కొన్నారు.

తెలుగుదేశం నేత ఈ ఎన్నికల్లో పరాజయ భయం వల్ల నోటికివచ్చినట్టుగా మాట్లాడుతున్నారని పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి ఉపక్రమిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులే తెలుగుదేశం కార్యకర్తల్లా వ్యవహరిస్తే ఇక ప్రజాస్వామ్యానికి పరిహాసం తప్ప మరేం మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా వుండగా నిన్నమొన్నటివరకు టిఆర్‌ఎస్‌కు దూరంగా వున్న కాంగ్రెస్‌ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల ముగిసిన తర్వాత జిల్లా పరిషత్‌ చైర్మన్‌ల ఎన్నికల విషయంలో మాత్రం టిఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకునే అవకాశం వున్నదని ప్రకటించింది. రెండో విడత ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొని వచ్చిన పిసిసి నేత సత్యనారాయణరావు బుధవారం నాడు ఈ విషయం సూచనప్రాయంగా వెల్లడించారు. సత్యనారాయణరావు విస్పష్టంగా ప్రకటించనప్పటికీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలంతా ఇదే విషయం చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణాన్ని బట్టి చూస్తే టిఆర్‌ఎస్‌తో పొత్తు వల్ల జెడ్‌పి చైర్మన్ల విషయంలో ఉభయులు లాభపడే అవకాశం వున్నదని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more