వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరంగల్‌లో బ్యాలెట్‌ బాక్స్‌ల అపహరణ

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో పీపుల్స్‌ వార్‌ ప్రభావం వున్న ప్రాంతాల్లో పోలింగ్‌ బహిష్కరణ ప్రభావం స్వల్పంగా కనిపించింది. అయితే పోలింగ్‌ ప్రక్రియకు ఆటంకం కలిగించేందుకు నక్సల్స్‌ కొన్ని చోట్ల బ్యాలెట్‌ బాక్స్‌లను అపహరించారు.

నర్మెట్టా మండలం వెల్డండా గ్రామంలో పోలింగ్‌కు ముందురోజు రాత్రే నక్సల్స్‌ బ్యాలెట్‌ బాక్స్‌లను అపహరించారు. జనగామ మండలం వెంకిర్యాలలో కూడా బాలెట్‌ బాక్స్‌లను నక్సలైట్లు అపహరించారు. చిట్యాల మండలం వెలిశాల, రామకృష్ణాపూర్‌ గ్రామంలో కూడా ఇవే సంఘటనలు జరిగింది.

ఒక్క వెల్డండలో మినహా మిగిలిన మూడు ప్రాంతాల్లో అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. వెల్డండలో మాత్రం శుక్రవారం నాడు రీపోలింగ్‌ నిర్వహిస్తున్నారు. కాగా భూపాలపల్లి మండలంలో టిడిపి కార్యకర్తలు బ్యాలెట్‌బాక్స్‌లను ఎత్తుకుపోయి నీళ్లులేని బావిలో వేశారు. పోలీసులు వీటిని పైకి తీసి మళ్లీ పోలింగ్‌ నిర్వహించారు. జిల్లాలో టిఆర్‌ఎస్‌ ప్రభావం గణనీయంగా వున్నదని పరిశీలకులు అంటున్నారు. టిడిపి, కాంగ్రెస్‌ కూడా రంగంలో వున్నప్పటికీ టిఆర్‌ఎస్‌ ప్రభావమే అధికంగా వుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X