వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రశాంతంగా 65 శాతం పోలింగ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాష్ట్రవ్యాప్తంగా జెటిపిటిసి, ఎంపిటిసిలకు జరుగుతున్న ఎన్నికల తొలివిడుత పోలింగ్‌ గురువారం నాడు చెదురుముదురు ఘర్షణల మధ్య మొత్తమ్మీద ప్రశాంతంగా ముగిసింది. 11 జిల్లాల్లో జరిగిన ఈ పోలింగ్‌లో కొన్ని ప్రాంతాల్లో బ్యాలెట్‌ బాక్స్‌లఅపహరణ, ప్రత్యర్ధి వర్గాల ఘర్షణ వంటి సంఘటనలతో పాటు అనేక ప్రాంతాల్లో మద్యం పంపిణీ, డబ్బుల పంపకం యథవిధిగా సాగింది.

ప్రత్యర్ధివర్గాలు హద్దుమీరిన చోట్ల పోలీసులు బలప్రయోగం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారాన్ని డిమాండ్‌ చేస్తూ కొన్ని చోట్ల ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు.స్వల్ప అవాంఛనీయ సంఘటనల మధ్య పోలింగ్‌ మొత్తంమ్మీద 65 శాతం మేర జరిగినట్టుగా ఎన్నికల కమిషనర్‌ కాకి మాధవరావు చెప్పారు. గురువారం రాత్రి వరకుఅందిన సమాచారం ప్రకారం 35 కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశించినట్టుగా ఆయన వెల్లడించారు. ఇంకా కొన్ని జిల్లాలనుంచి సమాచారంఅందాల్సి వున్నదని రీపోలింగ్‌ కేంద్రాల సంఖ్య పెరిగే అవకాశం వున్నదని ఆయన వెల్లడించారు.

కొన్ని జిల్లాల్లో జరిగిన చెదురుముదురు ఘటనలుమినహా పోలింగ్‌ మొత్తమ్మీద ప్రశాంతంగా ముగిసిందని డిజిపి హెచ్‌జె దొర చెప్పారు. చిత్తూరు, పశ్చిమ గోదావరి, వరంగల్‌, నెల్లూరు, గుంటూరు తదితర కొన్ని జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు జరిగినప్పటికీ పోలీసులు సకాలంలో జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తేగలిగినట్టు ఆయన చెప్పారు.పీపుల్స్‌వార్‌ ప్రభావం వున్న జిల్లాల్లో కూడా పరిస్థితి ప్రశాంతంగానే వున్నదని ఆయన వెల్లడించారు.

పీపుల్స్‌ వార్‌ ఎన్నికల బహిష్కరణ పిలుపు ప్రభావంపెద్దగా కనిపించలేదు. అధికారులు చెప్పిన దాని ప్రకారం గుంటూరు జిల్లాలో 65 శాతం పోలింగ్‌ జరిగింది. చిత్తూరు జిల్లాలో 65 శాతం, ఖమ్మంలో 68 శాతం, మహబూబ్‌నగర్‌లో 63 శాతం, నెల్లూరులో 62 శాతం, నిజామాబాద్‌లో 63 శాతం రంగారెడ్డిలో 68 శాతం,శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 72 శాతం, విశాఖపట్నంలో 60 శాతం, వరంగల్‌లో 60 శాతం పశ్చిమగోదావరి జిల్లాలో 69 శాతం పోలింగ్‌ జరిగినట్టు వార్తలు వచ్చాయి.

చిత్తూరులో ఘర్షణలు
ముఖ్యమంత్రి సొంతజిల్లా చిత్తూరు జిల్లాలో ప్రత్యర్ధి కాంగ్రెస్‌, తెలుగుదేశం వర్గాల ఘర్షణతో పోలీసులు బలప్రయోగం చేయాల్సివచ్చింది. ఈ జిల్లాలో 65 శాతం మేర పోలింగ్‌ జరిగింది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఘర్షణలోనే ఒక సిఐ గాయపడగా ఘర్షణలకు దిగిన ప్రత్యర్ధి వర్గాలను చూసి భయపడినరిటైర్డ్‌ ఉపాధ్యాయుడు రెడ్డన్న గుండెపోటుతో మరణించారు. జిల్లాలో కాంగ్రెస్‌, తెలుగుదేశం మధ్యనే పోటీతీవ్రంగా వుంది. తెలుగుదేశం పార్టీకి అసమ్మతి బెడద తీవ్రంగా వున్న కారణంగా పోలింగ్‌పై దాని ప్రభావం కనిపించే అవకాశం వున్నదని పరిశీలకులు అంటున్నారు.తెలుగు దేశంలోని అంతర్గత ఘర్షణల వల్ల కాంగ్రెస్‌ లాభపడే అవకాశం వున్నదనిఅంటున్నారు.

మహబూబ్‌ నగర్‌ జిల్లాలో.....
మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని 249 జడ్‌.పి.టి.సి.లు, 2534 ఎంపిటిసి లకు పోలింగ్‌ జరుగుతున్నది. పలు పోలింగ్‌ కేంద్రాలలో కనీస సదుపాయాలు లేక సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
ఇవి కాకుండా రంగారెడ్డి, ఖమ్మం, విశాఖపట్నం, గుంటూరు తదితర జిల్లాలలో పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X