వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిగ్‌బుల్‌ స్విస్‌ ఖాతాలో 400 కోట్లు

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: ఇటీవల స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణంలో ప్రధాన సూత్రదారిగా వున్న బిగ్‌బుల్‌ నెంబర్‌ టు కేతన్‌ పరేఖ్‌ కు సంబంధించినట్టుగా భావిస్తున్న స్విస్‌ ఖాతాలో 8 కోట్ల డాలర్లు (సుమారు 375 కోట్ల రూపాయలు) వున్నట్టుాగ బయటపడింది. సిబిఐ ఈ మధ్యనే ఈ ఖాతాను స్తంభింపజేసింది.

ఇంత భారీ మొత్తాన్ని ఏ హవాలా మార్గంలో కేతన్‌ స్విస్‌ ఖాతాకు తరలించాడో తెలుసుకునే పనిలో సిబిఐ అధికారులు ఇప్పుడు పడ్డారు. ఇదిలా వుండగా కేతన్‌ పరేఖ్‌ స్విస్‌ ఖాతాలకు అక్రమంగా నిధులు తరలించిన కొత్త ఆరోపణలపై సిబిఐ మరోసారి అరెస్టు చేసే అవకాశం వుండటంతో కేతన్‌ పరేఖ్‌ ముందస్తు బెయిల్‌ కోసం ముంబాయి కోర్టును శుక్రవారం నాడు ఆశ్రయించారు.

పరేఖ్‌, సిబిఐ ఉమ్మడి ఆమోదంతో ఈ బెయిల్‌ దరఖాస్తును 19కి న్యాయమూర్తి వాయిదా వేశారు వివిధ స్కామ్స్‌లో సంపాదించిన సొమ్మునే స్విస్‌ ఖాతాకు తరిలించినట్టుగా సిబిఐ చేసిన ఆరోపణలను పరేఖ్‌ ఖండించారు. బహుశ బహమాస్‌ ద్వారా ఈ సొమ్మును పరేఖ్‌ స్విట్జర్లాండ్‌కు తరలించి వుంటారని సిబిఐ అధికారులు అనుమానిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X