టీపార్టీకి కాంగ్రెస్రెడీ
న్యూఢిల్లీ: పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్ గౌరవార్థం పాక్ హైకమిషనర్ ఇచ్చేవిందుకు హాజరవుతామని కాంగ్రెస్‌ప్రకటించింది. ప్రధాని వాజ్‌పేయితో గురువారంసమావేశమైన అనంతరం కాంగ్రెస్ సీనియర్‌నాయకుడు ప్రణబ్ ముఖర్జీ ఈ విషయంచెప్పారు. హురియత్ నేతలను ఆహ్వానించిననేపథ్యంలో టీపార్టీకి వెళ్లాలా, వద్దా అనే విషయంలోకాంగ్రెస్ మల్లగుల్లాలు పడింది. ముషారఫ్ పర్యటన గురించిచర్చించేందుకు సోనియా గాంధీ సారథ్యంలోకాంగ్రెస్ ప్రతినిధి బృందం ప్రధానితోసమావేశమైంది.
ఈ బృందంలో మన్మోహన్సింగ్, మాధవరావు సింధియా, నట్వర్ సింగ్, ప్రణబ్‌ముఖర్జీ వున్నారు. ప్రధానితో కాంగ్రెస్ప్రతినిధులు 50 నిమిషాల పాటు చర్చలు జరిపారు. శిఖరాగ్రసదస్సుకు జరుగుతున్న ఏర్పాట్ల గురించి ప్రధానివారికి వివరించారు. సివ్లూ ఒప్పందం, లాహోర్డిక్లరేషన్ పరిధుల్లోనే చర్చలుజరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ముషారఫ్తోచర్చలకు ముందు వివిధ పార్టీల ప్రతినిధులతోవిడివిడిగా చర్చలు జరపాలన్న ప్రధాని నిర్ణయంలో భాగంగా ఈ సమావేశంజరిగింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!