వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌-భారత్‌ల శిఖరాగ్ర చర్చలు

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం:జెపిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు ఆదివారం నాడుపోలింగ్‌ జరుగనున్న రాయలసీమ జిల్లాలుకడప, అనంతలో పరిస్థితి ఉద్రిక్తంగా వుండటంతోఅధికారులు ప్రత్యేకంగా పెద్దఎత్తునభద్రతా చర్యలు తీసుకుంటున్నారు.ఫాక్షనిస్టు నేతలకు ఈ రెండు జిల్లాలు నిలయంకావడంతో పాటు ఈ రెండు జిల్లాలకు ఈ సారి కాంగ్రెస్‌,తెలుగుదేశం పార్టీ ప్రత్యేకప్రాధాన్యతనిచ్చి ప్రచారం చేయడంతోజిల్లాల్లో వాతావరణం ఇప్పటికే ఉద్రిక్తంగాతయారయింది. అనంతపురం జిల్లాల్లోప్రచారం సందర్భంగానే ఘర్షణలు పొడసూపినప్పటికీకడపలో ప్రచారం మటుకు ప్రశాంతంగానేసాగింది.

అనంతపురం,కడప జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుస్థానిక సంస్థల ఎన్నికల కోసం రెండువిడతలుగాప్రచారం చేశారు. ముఖ్యమంత్రి సుడిగాలిపర్యటనకు ధీటుగా కాంగ్రెస్‌ నేత వైఎస్‌కూడాఈ జిల్లాల్లో ముమ్మరంగా పర్యటించారు. కడపవైఎస్‌ సొంత జిల్లా కావడంతో రెండూ పార్టీలు ఈజిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాగాఅనంతలో రెండు పార్టీల నాయకులుతమకు పట్టు వున్న ప్రాంతాల్లోప్రత్యర్ధులను భయపెడుతున్నారనిసామదానభేదదండోపాయాలతో లొంగదీసుకోవడానికిప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

గతకొద్ది కాలంగా అజ్ఞాతంలో వున్న అనంత నేతపరిటాల రవి ఈ ఎన్నికల సందర్భంగా బయటకురావడంతో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా తయారయింది.అనంతలో అటు తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్‌రెండు పార్టీలు అధికార యంత్రాంగంపై అపనమ్మకంవ్యక్తం చేయడం గమనార్హం. ఈ రెండుజిల్లాల్లో పోలింగ్‌ సందర్భంగా అవాంచనీయసంఘటనలు జరగవచ్చనే భయంప్రజల్లో తీవ్రంగా కనిపిస్తున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X