వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటి వసంతంపైఅనలిస్టుల ఆశలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ప్రస్తుత ఆర్ధికసంవత్సరం తొలి మూడు నెలలకాలానికి దేశంలోని ప్రధానసాఫ్ట్‌వేర్‌ సంస్థలు ప్రకటించిన ఫలితాలుఅనలిస్టుల అంచనాలను అధిగమించాయి. అనలిస్టులఅంచనాలు మాత్రమే కాదు, కంపెనీలు స్వయంగావెల్లడించిన అంచనాల కంటే కూడా భిన్నంగా ఫలితాలువున్నాయి. ఇన్ఫోసిస్‌ స్థూల ఆదాయం 30 శాతాన్ని మించిపెరగకపోవచ్చని తొలుత భావించగా అది 72 శాతంపెరుగుదల చూపింది. ఇక సత్వం రాబడి విషయంలో తొలుతవేసుకున్న అంచనా 40 శాతాన్ని దాటి 76 శాతం

పెరిగింది. ఈ ఫలితాల సరళి కాకలు తీరినఅనలిస్టులు దిమ్మెరపోయేట్టుగా వుంది.ఇండియన్‌సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమకు ప్రధాన మార్కెట్‌గా వున్నఅమెరికా మాంద్యంలో కొట్టుకుంటుంటే ఈ సంస్థలు ఇలా రాణించడాన్ని ఏవిధంగా అర్ధం చేసుకోవాలో వారు వివరించలేకపోయారు.అమెరికా మాంద్యం భారతీయ సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమకువరం అంటూ కొందరు చేస్తున్న ప్రచారం నిజమని సింపుల్‌గా చెప్పితేసరిపోయేట్టుగా వుంది వ్యవహారం. అమెరికాకేంద్రంగా వున్న కొన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలుఇండియాలో అనుబంధ కేంద్రాలను ప్రారంభించి ఇక్కడినుంచి భారీగా వ్యాపారం చేస్తున్న మాట నిజమే. ఖర్చు తగ్గించుకోవడానికిఅమెరికాలో ఉద్యోగాల్లో కోతలు పెడుతూ అక్కడి ప్రాజెక్టులనుఇక్కడికి మళ్లిస్తున్న విషయం అందరికీ తెలుసు. అయితే పక్కాదేశీయ సంస్థలు కూడా ఈ విధంగారాణించడమే ఇక్కడ విశేషం. ఈ ఫలితాల ప్రభావంతో స్టాక్‌మార్కెట్‌ మరోసారి వేడెక్కింది. అయితే విశ్లేషకులుఅంతా ఈ ఫలితాలను చూసి మురిసిపోవడం లేదు.

అయితే ఈ ఫలితాలనువున్నదివున్నట్టుగా కాకుండా మరో కోణం నుంచిచూస్తే మనకు అసలు విషయం అవగతం అవుతుందనిమార్కెట్‌ నాడి బాగా తెలిసిన మరికొందరు అనలిస్టులుఅంటున్నారు గత ఏడాది మూడు నెలల కాలంతో పోలిస్తేవృద్ధి రేటు దండిగా వున్నట్టుకనిపిస్తున్నదని అయితే వరసనే ప్రతిమూడునెలల వృద్ధి రేటును చూస్తే మాత్రం ఇదిచాలా తక్కువగా వుంది. గత ఏడాది తొలి మూడునెలల కాలంలో ఇన్పోసిస్‌ రెవెన్యూ వృద్ధి రేటు 30 శాతంవుండగా ఈ ఏడాది కేవలం తొమ్మిది శాతం మాత్రమేవుంది. అదే విధంగా సత్యం గత ఏడాది తొలి త్రైమాసికంలో 18శాతంవృద్ధిని సాధించగా ఈ ఏడాది తొలిమూడు నెలల్లోవృద్ధి కేవలం 6 శాతం మాత్రమే వుంది. బిల్లింగ్‌రేట్లపై తీవ్రమైన వత్తిడి వున్న విషయంఅటు ఇన్ఫోసిస్‌ ఇటు సత్యం కూడా అంగీకరించాయి.

రాబడి పెంచుకునేప్రయత్నంలో మార్జిన్లను గణనీయంగా తగ్గించుకోవడానికి ఈ రెండు సంస్థలుసిద్ధపడ్డాయి. ఈ పరిస్థితిని అనలిస్టుల్లోని రెండువర్గాలు ఎవరికి అనుకూలమైన రీతిలో వారు వ్యాఖ్యానిస్తున్నారు.నిరాశావాదులు దృష్టిలో వాస్తవానికి ఈ తొలి మూడునెలఆదాయం మార్కెట్‌ మంచి ఊపులో వున్న సమయంలోవచ్చిన ప్రాజెక్టులను ఎక్జిక్యూట్‌ చేయడంవల్ల లభించింది. కొత్త ఆర్డర్లు నిలిచిపోయిన కారణంగా రానున్ననెలల్లో పరిస్థితి మరింత దిగజారే అవకాశంవుంది. అయితే ఆశావాదులు అలా చూడటం లేదు.అమెరికాలో మాంద్యం పరిస్థితులు ఏర్పడినప్పటికీవినియోగంపై దాని ప్రభావం పెద్దగా కనిపించంలేదని వారు అంటున్నారు. అంతే కాకుండా మాంద్యం ఈ ఏడాది చివరికల్లా తొలిగిపోయేఅవకాశం వున్నదని వారి అంచనా. మరో వైపుఐటిపై ఖర్చు విషయంలో తొలినెలల్లో బిగదీసుకున్న కంపెనీలు రానున్నరోజుల్లో మళ్లీ ఉదారంగా ఖర్చు చేసే అవకాశంవుంది. అందువల్ల సంవత్సరాంతానికి ఐటి వసంతాన్నే ఈఅనలిస్టులు ఆశిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X