వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వహ్‌... తాజ్‌:ముషారఫ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఆగ్రా: ప్రపంచప్రసిద్ధి గాంచిన ప్రేమ చిహ్నం తాజ్‌మహల్‌నుచూసి పాకిస్థాన్‌ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌,ఆయన సతీమణి బేగం సాహెబా మంత్రముగ్ధులయ్యారు. ఆదివారం సాయంత్రం వారు తాజ్‌మహల్‌నుసందర్శించారు. అద్భుతం, అత్యద్భుతం, అమోఘం అనిముషర్రాఫ్‌ తాజ్‌మహల్‌ను అభివర్ణించారు.తాజ్‌మహల్‌ను చూసిన వెంటనే ముషారఫ్‌,ఆయన సతీమణి బేగం సాహెబా ఆశ్చర్యచకితులయ్యారు. వారిద్దరు గంట సేపు అక్కడగడిపారు.

బిహెచ్‌ఇఎల్‌ ప్రత్యేకంగారూపొందించిన ఎలక్ట్రిక్‌ వాహనంలో ముషారఫ్‌ దంపతులుఅక్కడికి చేరుకున్నారు. పాదరక్షలు విడిచి తూర్పువైపు గేటు నుంచి ప్రాంగణంలోకి ప్రవేశించారు.తాజ్‌మహల్‌ ముందున్న లవర్స్‌ బెంచ్‌పై కూర్చునివారు ఫొటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు.దంపతులిద్దరూ చేతిలో చేయి వేసుకునితాజ్‌మహల్‌ చుట్టూ తిరిగారు. ప్రపంచలోని ఏడు వింతల్లోఒకటైన తాజ్‌మహల్‌ను సందర్శించడం జీవితంలోమర్చిపోలేని అనుభూతి. తాజ్‌ అందాలు అద్భుతం.షాజహాన్‌ చక్రవర్తి తెలివితేటలు, సౌందర్య పిపాసను ఈ అద్భుతకట్టడంలోని ప్రతి అంగుళం ప్రతిబింబిస్తోంది.దీన్ని సందర్శించే అవకాశం రావడం నిజంగాఅదృష్టమే అని ముషారఫ్‌ విజిటర్స్‌ బుక్‌లోరాశారు.

వాస్తవానికి 20 నిమిషాలు మాత్రమేతాజ్‌మహల్‌ సందర్శనకుకేటాయించుకున్నారు. అయితే సరదా ముచ్చటించుకుంటూ 50నిమిషాలు గడిపేశారు. బయటకు వచ్చిన తర్వాతఉద్యానవనంలో కూడా కొంతసేపు తిరిగారు. ముషారఫ్‌సందర్శనను పురస్కరించుకుని ఆదివారం నాలుగు గంటల పాటుసందర్శకులెవరినీ అనుమతించలేదు. స్థానిక గైడ్‌, ప్రముఖఆర్కియాలాజిస్టు మహమ్మద్‌ కె.కె. ముషారఫ్‌ దంపతులకుతాజ్‌మహల్‌ చారిత్రక సందర్భాన్ని, అందచందాలనుసోదాహరణంగా వివరించి చెప్పారు.

  • ఆగ్రాశిఖరాగ్రం
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X