వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్చల్లో ప్రతిష్టంభ: వెనుతిరిగిన ముషారఫ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఆగ్రా: భారత ప్రధాని వాజ్‌పేయి, పాకిస్తాన్‌ అగ్రనేత ముషారఫ్‌ మధ్య జరుగుతున్న శిఖరాగ్ర చర్చలు సోమవారం రెండో రోజు అనూహ్యమైన మలుపు తిరిగాయి. రెండు దేశాలు తమ తమ వైఖరులకే గట్టిగా కట్టుబడి వుండటంతో సోమవారం రాత్రి బాగా పొద్దుపోయే వరకు కూడా శిఖరాగ్ర సభల ముగింపు సందర్భంగా ఉభయదేశాల నేతలు విడుదల చేయాల్సిన ఉమ్మడి ప్రకటన ఖరారు కాలేదు.

ఈ ప్రతిష్టంభనకు భారత్‌ కారణమని పాకిస్తాన్‌ ప్రతినిధులు, పాక్‌ మొండివైఖరి కారణమని భారత్‌ ఆరోపించాయి. రాత్రి 10 గంటల ప్రాంతంలో చర్చలు విఫలమైనట్టుగా వార్తలు వచ్చినప్పటికీ పరిశీలకు మాత్రం అలాంటి తొందరపాటు అభిప్రాయాలకు రావడం సరికాదని అన్నారు. ఉమ్మడిప్రకటన లేకున్నా కనీసం మరోసారి సమావేశం కావాలనే నిర్ణయంతో ఈ శిఖరాగ్ర సభను ముగిస్తున్నామనే క్లప్తమైన ప్రకటనైనా రెండు దేశాలు చేసే అవకాశం వున్నదని వారు అన్నారు. ఏదీ ఏమైనా తాను రాత్రి ఇస్లామాబాద్‌ బయలుదేరి వెళ్లుతున్నట్టుగా ముషారఫ్‌ ప్రకటించారు.

తొలివార్తలు:

రెండోరోజు సోమవారం నాడు అనుకోకుండా వాతావరణం గంభీరంగా మారింది. కాశ్మీర్‌ విషయంలో వెనక్కితగ్గేది లేదని పాక్‌ నేత భీష్మించుక్కూచోవడం అదే సమయంలో భారత్‌, కాశ్మీర్‌ను అనేక విషయాల్లో ఒకటిగా మాత్రమే చర్చించాలని పట్టుబట్టడంతో పరిస్థితి జఠిలంగా మారింది. ముందుగా అనుకున్న దానికి భిన్నంగా వాజ్‌పేయి, ముషారఫ్‌ సోమవారం నాడు మరో రెండు విడతలు ముఖాముఖి చర్చలు జరిపారు. సోమవారం నాడు ప్రధాని వాజ్‌పేయితో నాలుగోవిడత చర్చలకు వీలుగా ముషారఫ్‌ ఆజ్మీర్‌, జైపూర్‌ పర్యటనను వాయిదా వేసుకోవడంతో పాటు అవసరమైతే మరో 48 గంటలు తన పర్యటనను పొడిగించుకోవడానికి కూడా సిద్ధపడ్డారు.

ఆదివారం నాడు రెండు విడతల చర్చలు జరిపిన ఇద్దరు నేతలు సోమవారం నాడు మరో రెండు విడతల చర్చలు జరిపారు. నాలుగు విడతల చర్చ తర్వాత సాయంత్రం నాలుగున్నరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేయాలని తొలుత నిర్ణయించినప్పటికీ ప్రకటన ఖరారు విషయంలో ఉభయదేశాల ప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రాత్రి పొద్దుపోయే వరకు ఈ విషయం ఎటూ తేలకుండా వుండిపోయింది. జేపీ హోటల్లో మధ్యాహ్నం నుంచే దేశవిదేశీ విలేకరులు ఉమ్మడి ప్రకటన విడుదల చేస్తారా, ఇద్దరు నేతలు విలేకరులతో మాట్లాడుతారా ఊహగానాలు చేస్తూ ఉత్కంఠతో వేచివున్నారు.

రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కుదరడంతో ముషారఫ్‌ ప్రకటనపై సంతకం చేసి సోమవారం రాత్రే స్వదేశం తిరిగి వెళ్లుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. దాంతో విలేకరులంతా ఉమ్మడి ప్రకటన కోసం మరోసారి జేపీ హోటలకు ఉరుకులు పరుగున చేరుకున్నారు. అయితే రాత్రి వరకు అధికార వర్గాల నుంచి చర్చల పురోగతిపై ఎటువంటి సమాచారం రాకపోవడంతో ఆందోళన, ఉత్కంఠ పెరిగిపోయాయి.

  • ఆగ్రాశిఖరాగ్రం
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X