వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుష్‌గారి పిల్లి ఇండియా!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : అమెరికా అధ్యక్షుడు బుష్‌గారు తన పెంపుడు పిల్లికి ఇండియా అని పేరుపెట్టుకుని మన దేశంపై తనకున్న అభిప్రాయాన్ని, అభిమానాన్నీ బహిర్గత పరచారు. అమెరికా అధ్యక్షుని అధికారిక వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని సగౌరవంగా ప్రకటించారు. వెబ్‌సైట్‌లో బుష్‌ వ్యక్తి గత జీవితాన్ని గురించి వివరాల్లో ఈ పిల్లి ప్రస్తావన వుంది.

అధ్యక్షుడు బుష్‌ మాజీ ఉపాధ్యాయురాలు, లైబ్రేరియన్‌ అయిన లూరా వెల్చ్‌ బుష్‌ను వివాహమాడారు. వారికి 19 సంవత్సరాల వయస్సువున్న బార్బరా, జెన్నా అన్న కవల ఆడపిల్లలువున్నారు. బుష్‌ కుటుంబానికి స్పాట్‌, బర్నీ అన్న పేర్లగల రెండుకుక్కలు, ఇండియాఅన్న పేరుగల ఒక పిల్లిపిల్లా వున్నాయి.... బుష్‌ పరిచయం ఈ ధోరణిలో సాగింది.

అమెరికా స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా అభినందనలు తెలిపే ఉద్దేశ్యంతో వారి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించిన ఒక యువకుడు ఈ రాతలు చూసి ఖిన్నుడై మనకు జరిగిన ఈ అవమానాన్ని అన్ని రాజకీయపార్టీలు, భారత జాతీయులు తీవ్రంగా ప్రతిఘటించాలని కోరుతూ తనకు తెలిసిన వారికి మెసెజ్‌లు పంపారు. ఈ విషయంలో ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాల్సిందిగా ఇండియాఇన్ఫోను కోరారు. ఈ విషయంపై మీ నిరసనను అమెరికా అధ్యక్షుని అధికారిక వెబ్‌సైట్‌కు పంపండి. వెబ్‌సైట్‌ చిరునామా-
http://www.whitehouse.gov

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X