పాక్ వైఖరిపైజస్వంత్ ధ్వజం
ఆగ్రా: భారత్-పాక్‌ల మధ్య ఆగ్రా శిఖరాగ్రసదస్సు వైఫల్యానికి పాకిస్థాన్ వైఖరే కారణమని భారత్ ధ్వజమెత్తింది.పాకిస్థాన్ ఏకపక్ష వైఖరి వల్ల, సీమాంతర ఉగ్రవాదాన్నిచర్చనీయాంశంగా పరిగణించకపోవడం వల్ల, ఇరుదేశాల మధ్య జరిగిన గత ఒప్పందాలనుకాదనే ప్రయత్నం వల్ల ఆగ్రా శిఖరాగ్ర సదస్సువిఫలమైందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిజస్వంత్ సింగ్ విమర్శించారు. ఆయన మంగళవారంఉదయం విలేకరుల సమావేశంలో పాక్ వైఖరిపైవిమర్శలు గుప్పించారు.
ఇరు దేశాలు ఒక ఒప్పందానికి రాకపోవడం పట్లఆయన విచారం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య విభేదాలు పరిష్కారం కాకపోవడంవల్లనే సంయుక్త ప్రకటన వెలువడలేదనిఆయన చెప్పారు. పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్‌ముషారఫ్ ఆహ్వానాన్ని భారత ప్రధాని వాజ్‌పేయి తిరస్కరించారనేఊహాగానాలను ఆయన ఖండించారు.
పాక్ ఆహ్వానాన్నివాజ్‌పేయి అంగీకరించారని, ఆ అంగీకారానికి కట్టుబడివుంటామని ఆయన చెప్పారు. ఆగ్రా సదస్సు విఫలమైందనితాను అనుకోవడం లేదని, శాంతి సాధనలో ఇదొకమెట్టు అని ఆయన అన్నారు. ఇరు దేశాల మధ్య శాంతి,సుహృద్భావ సాధన కోసం ప్రయత్నాలుకొనసాగుతాయని ఆయన చెప్పారు. కాశ్మీర్ మాత్రమే కీలకాంశమని పాక్‌వాదించగా, కాశ్మీర్‌తో పాటు సీమాంతర ఉగ్రవాదం, తదితరఅంశాలు కూడా చర్చల్లో భాగమని భారత్ భావించిందనిఆయన అన్నారు. ఒక్క అంశం మాత్రమే కీలకాంశంకాదని, అన్ని అంశాలూ కీలకమేననేది భారత్‌అభిప్రాయమని ఆయన అన్నారు. సమాచార, ప్రసారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటనకు తామందరం కట్టుబడి వుంటున్నామనిఆయన చెప్పారు.
పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్‌ను విలేకరులతో మాట్లాడకుండా భారత్‌అడ్డుకున్నదనే విమర్శలను ఆయన ఖండించారు.ముషారఫ్ విలేకరులతో మాట్లాడే ప్రశ్ననే ఉత్పన్నంకాదని ఆయన అన్నారు.
శిఖరాగ్ర సదస్సుకుముందు ఎజెండా ఖరారుకు తగిన ఇరుదేశాల మధ్య తగినచర్యలు తీసుకోలేదా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకుతాము ఇస్లామాబాద్‌కు అధికారుల బృందాన్ని పంపుతామనిచెప్పామని, అయితే పాకిస్థాన్ అవసరం లేదనిచెప్పిందని ఆయన జవాబిచ్చారు. ఎజెండా ఖరారుకుతాము ప్రయత్నాలు చేశామని ఆయన చెప్పారు.
- ఆగ్రాశిఖరాగ్రం
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!