వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Home

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నష్టాల్లో వున్న ప్రభుత్వ రంగ సంస్థలను(పిఎస్‌యులను) కొన్నింటిని మూసి వేస్తామని ప్రధానిఅటల్‌ బిహరీ వాజ్‌పేయి చెప్పారు. కొన్ని సంస్థలనుపునర్వ్యస్థీకరించి నడిపిస్తామని కూడా ఆయనఅన్నారు. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థలనుపునర్వ్యస్ఠీకరిచనున్నట్లు ఆయన తెలిపారు. అయితే కార్మికులప్రయోజనాలు దెబ్బ తినకుండా చూస్తామనిఆయన హామీ ఇచ్చారు.

ఆయన శనివారం 1999 శ్రమఅవార్డులను ప్రదానం చేశారు. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ సంస్కరణలవ్యూహంలో అంతర్భాగమని ఆయన చెప్పారు.జనశ్రీ బీమా యోజన వంటి కొత్త బీమాపథకాలతో సామాజిక భద్రతను ఖాయం చేసేచర్యలు తీసుకుమంటామని ఆయన చెప్పారు. ఉత్తమసేవలందించేలా ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్స్యూరెన్స్‌కార్పోరేషన్‌ను, ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ సంస్థనుపునర్వ్యవస్థీకరించనున్నట్లు ఆయన తెలిపారు.

వ్యవసాయ కూలీలకు చట్టపరమైన రక్షణగానీ, సామాజిక భద్రత గానీ లేదని, కార్మిక మంత్రిత్వ శాఖసమగ్రమైన సామాజిక భద్రతా పథకాన్నిరూపొందిస్తోందని ఆయన చెప్పారు.

కార్మిక వర్గం ప్రయోజనాలుముఖ్యంగా అసంఘటిత రంగంలోని కార్మికులప్రయోజనాలు పరిరక్షించడం తమ ముఖ్య లక్ష్యమనిఆయన అన్నారు. దశాబ్ది క్రితం సంస్కరణలుప్రారంభమయ్యాయని, వాటి ఫలితాలు ఇప్పుడిప్పుడే అనుభవంలోకివస్తున్నాయని ఆయన అన్నారు. ఆర్థిక పెరుగుదల రేటు ఆరునుంచి ఏడుకు పెరిగిందని, పేదరికం 26 శాతం తగ్గిందని ప్రధానిఅన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X