• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణాలో గులాబీ రెపరెపలు

By Staff
|
హైదరాబాద్‌: స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల ఫలితాల సరళిపట్ల తెలంగాణా రాష్ట్ర సమితి హర్షం వ్యక్తం చేసింది. ఎన్నికల ఫలితాలు తాము ఊహించినట్టుగానే వున్నాయని టిఆర్‌ఎస్‌ నేత చంద్రశేఖర్‌రావు చెప్పారు. తాము ఈ ఎన్నికల్లో రాజకీయ లబ్ధిని ఆశించి పోటీ చేయలేదని, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆవశ్యకత సందేశాన్ని తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో వ్యాప్తి చేయడం కోసం ఒక సాధనంగా మాత్రమే ఈ ఎన్నికలను భావించామని ఆయన చెప్పారు.

ఆశించిన విధంగా తాము తెలంగాణా జిల్లాలో నిర్ణాయక శక్తిగా ఆవిర్భావించినట్టుగా చెప్పారు. కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలో తాము జెడ్‌పి చైర్మన్‌ పదవిని కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా వున్నాయని ఆయన చెప్పారు. తాము ఊహించినదాని కంటే తెలంగాణా సందేశాన్ని వేగంగా వ్యాపింపజేయగలిగినట్టు ఆయన వెల్లడించారు. తమకు తెలుగుదేశం నెగెటివ్‌ ఓట్లు వచ్చాయనే వాదనను తోసిపుచ్చుతూ, తెలుగుదేశం పార్టీ పట్ల వ్యతిరేకత సాధరణంగా మొదటినుంచి వున్నదేనని తమకు వచ్చిన ఓట్లు, సీట్లు అన్నీ తెలంగాణా రాష్ట్రాన్ని కాంక్షించేవారివేనని ఆయన తెలిపారు. ఆదిలాబాద్‌లోని మారుమూల ప్రాంతాల్లోని గిరిజన తండాల్లో కూడా తమ ఉద్యమానికి మద్దతు లభిస్తున్నదని ఆయన వెల్లడించారు. తెలంగాణా రాష్ట్ర సాధనే తమ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా వుండగా నిండా మూడునెలల వయస్సు కూడా లేని టిఆర్‌ఎస్‌ బలమైన శక్తిగా ఈ ఎన్నికలతో తెలంగాణా యవనికపై ఆవిర్భవించింది. నిజామాబాద్‌ జిల్లాల్లో ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, తెలుగుదేశం టిఆర్‌ఎస్‌ తాకిడికి వెలవెలపోతున్నాయి. కరీంనగర్‌ జిల్లాలో కూడా టిఆర్‌ఎస్‌ జోరు సాగుతున్నది. ఆదిలాబాద్‌ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యతకు భంగం కలగనప్పటికీ టిఆర్‌ఎస్‌ తన ఉనికిని అక్కడ కూడా చాటుకోగలిగింది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహబూబ్‌నగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌, తెలుగుదేశం మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా వుంది. అయితే ఈ జిల్లాలో తెలుగుదేశం తన ఆధిక్యతను కాపాడుకోగలిగిందని చెప్పవచ్చు. ఈ జిల్లాల్లో టిఆర్‌ఎస్‌ కొంతవెనకబడి వుంది. బిజెపి గురించి ప్రత్యేకంగా చెప్పుకునే పరిస్థితి ఏమీ లేదు. వరంగల్‌ తెలుగుదేశం, కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ మధ్య త్రిముఖ పోటీ నడుస్తున్నప్పటికీ విజయభేరి టిఆర్‌ఎస్‌దే నని చెప్పవచ్చు. మెదక్‌ జిల్లాలో కూడా టిఆర్‌ఎస్‌ ప్రధాన పార్టీలు రెండింటికి ధీటుగా వుంది.

  • స్థానిక సంస్థలఫలితాలు-జిల్లాల వారీగా

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more