వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైకిల్‌ దూకుడుకు హస్తం అడ్డు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర రాజకీయాలను గత కొద్ది కాలంగా ఎదురులేకుండా శాసిస్తున్న తెలుగుదేశం పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. మెజార్జీ జిల్లాల్లో ప్రత్యర్ధి కంటే పై చేయిగానే వున్నప్పటికీ అనేక చోట్ల అనూహ్యంగా అధికార పార్టీ భంగపడింది. ఏడు జిల్లాల్లో కాంగ్రెస్‌, తెలుగుదేశం ఆధిక్యతతో వుండగా రెండు జిల్లాల్లో టిఆర్‌ఎస్‌ స్పష్టమైన మెజార్జీని సాధించింది. కాగా ఆరుజిల్లాల్లో పరిస్థితిని నువ్వానేనా అన్నట్టుగా వుంది.మెజార్జీ జిల్లాల్లో ప్రత్యర్ధి కంటే పై చేయిగానే వున్నప్పటికీ అనేక చోట్ల అనూహ్యంగా అధికార పార్టీ భంగపడింది. ఈ ఎన్నికల్లో ఓటర్లు అన్ని ప్రధాన పార్టీల అంచనాలను తలకిందులు చేశారు.

మంగళవారం రాత్రి వరకు ప్రకటించిన జెపిటిసి స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 180 స్థానాలను కైవసం చేసుకోగా కాంగ్రెస్‌ కూడా దీటైన రీతిలో 160 స్థానాలను గెలుచుకున్నది. తెలంగాణాలో బలమైన శక్తిగా ఎదిగిన టిఆర్‌ఎస్‌ 20 స్థానాలు లభించాయి. ఎంపిటిసి స్థానాలకు సంబంధించి కాంగ్రెస్‌, తెలుగుదేశం చెరో 3000 స్థానాలను దక్కించుకున్నాయి. టిఆర్‌ఎస్‌ 400 స్థానాల్లో విజయపతాక ఎగురవేసింది. తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ బలమైన నిర్ణాయక శక్తిగా ఆవిర్భవించింది. తెలంగాణాలో నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో టిఆర్‌ఎస్‌ ఎదురులేని విజయం సాధించింది. ఆదిలాబాద్‌లో మాత్రమే తెలుగుదేశానికి ఊరడింపు లభించింది.

రాయలసీమ జిల్లాల్లో తెలుగుదేశం ఆధిక్యతను కాంగ్రెస్‌ గట్టి దెబ్బతీసింది . చిత్తూరు, అనంతపురం జిల్లాలో తెలుగుదేశం, కాంగ్రెస్‌ మధ్య పోటీ నువ్వానేనా అన్న స్థాయిలో వుంది. తెలుగుదేశం అధినేత సొంత జిల్లా చిత్తూరులో కాంగ్రెస్‌ రాణించడం ఆ పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అదే సమయంలో కాంగ్రెస్‌ నేత వైఎస్‌ సొంత జిల్లా కడపలో కూడా కాంగ్రెస్‌ సంచలన విజయాలను కైవసం చేసుకున్నది. కాంగ్రెస్‌ పార్టీ మరో సీనియర్‌ నేత విజయభాస్కర్‌రెడ్డి జిల్లా కర్నూల్‌లో మాత్రం తెలుగుదేశం దూకుడు కొనసాగించింది. ఈ జిల్లాలో పోలింగ్‌కు ముందే ఏడు స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్ధురులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తెలుగుదేశం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా కోల్పోయినట్టే లెక్క. కోస్తా జిల్లాల్లో తెలుగుదేశం ఘోరమైన అవమానాలనే చవిచూడాల్సి వచ్చింది. ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళంలో తెలుగుదేశం పట్టు కొనసాగగా, విజయనగరంలో కాంగ్రెస్‌ ఆధిక్యత సాధించింది. విశాఖపట్నంలో తెలుగుదేశం కాంగ్రెస్‌ పోటాపోటీగా సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి ఉభయగోదావరి జిల్లాల్లో ఆ పార్టీ పునాదులను కాంగ్రెస్‌ కదిలించగలిగింది. కృష్ణాలో అవమానాన్నే దిగమింగుతున్న అధికారపార్టీ గుంటూరులో మాత్‌ పరువు దక్కించుకున్నది. ప్రశాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా తెలుగుదేశం కాంగ్రెస్‌తో ఢికొనే విషయంలో కొంత డీలానే పడింది.

  • స్థానిక సంస్థలఫలితాలు-జిల్లాల వారీగా
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X