• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కిస్సా కుర్సీకా...ప్రారంభం

By Staff
|

హైదరాబాద్‌: ప్రాదేశీక ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు వుండటంతో ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకమైన జెడ్‌పి చైర్మన్‌ పదవుల కోసం కసరత్తులు ప్రారభించాయి. అనేక జిల్లాల్లో సొంతకాళ్ల మీద జడ్‌పి చైర్మన్‌ పదవులను కైవసం చేసుకునే పరిస్థితి ఏ ఒక్కపార్టీకి లేకపోవడంతో ఎదుటిపక్షాలతో పొత్తు పెట్టుకోవడమో లేక వైరిపక్షాల జెడ్‌పిటిసి సభ్యులకు గాలం వేయడమో తప్పని పరిస్థితి కనిపిస్తున్నది.

ఖమ్మం ,నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ వామపక్షాలతో పొత్తుపెట్టుకుని జెడ్‌పి చైర్మన్‌ స్థానాల కైవసానికి సన్నాహాలు చేస్తున్నది. వామపక్షాలకు ఈ రెండు జిల్లాల్లో వైస్‌ చైర్మన్‌ పదవులను కాంగ్రెస్‌ నేతలు ఆఫర్‌ చేస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లో సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు కొందరు చైర్మన్‌ పదవి తమవర్గానికి దక్కించుకునే ప్రయత్నంలో వున్నారు. అధిష్టానంతో సంబంధం లేకుండా ఎవరికివారుగా వెళ్లి వారు వామపక్షాలతో బేరాలు సాగిస్తున్నారు.

కాగా నాలుగు తెలంగాణా జిల్లాలు వరంగల్‌, మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పొత్తుపెట్టుకుంటే తప్ప ఇక్కడ జెడ్‌పి చైర్మన్‌ పదవులను దక్కించుకునే పరిస్థితి కాంగ్రెస్‌కు గానీ టిఆర్‌ఎస్‌కు గానీ లేదు. నిజామాబాద్‌ జిల్లాలో మాత్రం టిఆర్‌ఎస్‌ సొంతగానే జెడి చైర్మన్‌ పదవిని దక్కించుకునే అవకాశం వున్నది. మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలంటే గెలిచిన జెడ్‌పిల్లో తొలిరోజునే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటును డిమాండ్‌ చేస్తూ తీర్మానం చేయాలని టిఆర్‌ఎస్‌ నేత చంద్రశేఖర్‌రావు షరతు విధించారు.

అయితే ఈ షరతును తాము ఎంత మాత్రం ఆమోదించమని కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేశారు. ఆసలు టిఆర్‌ఎస్‌ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ప్రత్యేక తెలంగాణా ఉద్యమం బలహీనపడిందని పిసిసి నేత సత్యనారాయణరావు వ్యాఖ్యానించగా, టిఆర్‌ఎస్‌ ప్రభావం తెలంగాణా జిల్లాల్లో పెద్దగా లేదనడానికి మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నల్గొండ ఫలితాలే నిదర్శనమని వైఎస్‌ పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌కు గురించి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల వైఖరి ఈ విధంగా వుండగా కాంగ్రెస్‌ను టిఆర్‌ఎస్‌ కూడా అంతే లైట్‌గా తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణా జిల్లాల్లో జెడ్‌పి చైర్మన్ల ఎంపిక వ్యవహరం రక్తి కట్టే అవకాశం వున్నదని పరిశీలకులు అంటున్నారు.

  • స్థానిక సంస్థలఫలితాలు-జిల్లాల వారీగా

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more