వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భవిష్యత్తుపై బాబు ధీమా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో అనూహ్యమైన పరాభవాన్ని మూటకట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఆత్మవిమర్శ ప్రారంభించింది. ఎన్నికల ఫలితాలు తమ అంచనాలకు భిన్నంగా వున్నాయనే విషయం అంగీకరిస్తూ ఎందుకు ఇలా జరిగిందనే విషయాన్ని భిన్న కోణాలనుంచి సమీక్షిస్తున్నట్టు ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెప్పారు.

స్థూలంగా చూస్తే తెలుగుదేశం పార్టీ అధిక్యతకు ఈ ఎన్నికల్లో వచ్చిన లోటేమీ లేదని ఆయన పైకి చెబుతున్నప్పటికీ ఈ ఎన్నికలు ఆయనకు షాక్‌నిచ్చిన విషయం ఆయన మొహంలో స్పష్టంగా కనిపించింది. ఓటమి తెలుగుదేశం విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అనే వాదనను చంద్రబాబు తోసిపుచ్చారు. తమ విధానాలను మార్చుకోవల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ఆత్మవిమర్శ, సమగ్రమైన సమీక్ష ఆధారంగా భవిష్యత్తులో ప్రజల మద్దతు చెక్కుచెదరకుండా వుండే విధంగా అవసరమైన చర్యలను పార్టీ తీసుకుంటుందని ఆయన చెప్పారు.

ఉచిత విద్యుత్‌ వంటి అచరణయోగ్యం కానీ హామీలతో ఓటర్లను ప్రతిపక్షాలు ఈ ఎన్నికల్లో వంచించాయని ఆయన చెప్పారు. ప్రజలు మూడ్‌లో సహజంగా వచ్చే మార్పు కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిందని ఆయన అన్నారు. ఇక్కడ ఉచిత విద్యుత్‌ గురించి ఇన్ని కబుర్లు చెబుతున్న కాంగ్రెస్‌ పార్టీ నేతలు తాము అధికారంలో వున్న రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌ ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. తీర్చాల్సిన బాధ్యత లేనప్పుడు ఎలాంటి హామీలైనా ఇవ్వవచ్చనే ధోరణి కాంగ్రెస్‌దని ఆయన దుయ్యబట్టారు. విద్యుత్‌ చార్జీల పెంపు, బిజెపితో పొత్తు, ధాన్యం
కొనుగోలు వ్యవహారంలో జరిగిన అవకతవకలతో పాటు స్థానిక అంశాలు ఈ ఎన్నికల్లో ఫలితాలను ప్రభావితం చేశాయని ఆయన అన్నారు. తమ విధానాలను ప్రజల హృదయాల్లోకి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు.

  • స్థానిక సంస్థలఫలితాలు-జిల్లాల వారీగా
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X