వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరికెన్ని జిల్లా పరిషత్‌లు?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీదెబ్బ తిన్నట్లు కనిపిస్తున్నప్పటికీ సగం జిల్లా పరిషత్‌ చైర్మన్ల పదవులను దక్కించుకోగలిగే బలాన్ని సంతరించుకుంది. పది జిల్లా పరిషత్‌ చైర్మన్ల పదవులు పాలక తెలుగుదేశం పార్టీకిదక్కేఅవకాశాలున్నాయి.

77 రోజుల తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) రెండు జిల్లా పరిషత్‌లను సొంతంగాకైవసం చేసుకోనుంది. కాంగ్రెస్‌ వామపక్షాలు, టిఆర్‌ఎస్‌లతో కలిస్తే ఎనిమిది జిల్లా పరిషత్‌లను చేజిక్కించుకోగలదు. వరంగల్‌లో పరిస్థితి బుధవారం ఉదయం వరకు కూడా పరిస్థితి తెలియరాలేదు.విజయనగరం జిల్లాలో కాంగ్రెస్‌, తెలుగుదేశం చెరి సగం జడ్‌పిటిసిలను గెల్చుకున్నాయి. దీంతో చైర్మన్‌ పదవి ఎవరిని వరిస్తుందో చెప్పే పరిస్థితి లేదు.

తెలుగుదేశం పార్టీకి దక్కే జిల్లా పరిషత్‌లు
1.శ్రీకాకుళం
2. తూర్పుగోదావరి
3. పశ్చిమ గోదావరి
4. కృష్ణా
5. గుంటూరు
6. ప్రకాశం
7. అనంతపురం
8. కర్నూలు
9. మహబూబ్‌నగర్‌
10. ఆదిలాబాద్‌

కాంగ్రెస్‌కు దక్కే జిల్లా పరిషత్‌లు
1.విశాఖపట్నం
2. నెల్లూరు
3. చిత్తూరు
4. కడప
5. రంగారెడ్డి (టిఆర్‌ఎస్‌, వామపక్షాలను కలుపుకుంటే)
6. నల్లగొండ
7. ఖమ్మం (వామపక్షాలను కలుపుకుంటే)
8. మెదక్‌ (టిఆర్‌ఎస్‌ను కలుపుకుంటే)

తెలంగాణా రాష్ట్ర సమితికి దక్కే జిల్లా పరిషత్‌లు
1. నిజామాబాద్‌
2. కరీంనగర్‌

  • స్థానిక సంస్థలఫలితాలు-జిల్లాల వారీగా
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X