వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్‌ ప్రధాని రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

ఖాట్మాండు: నేపాల్‌ ప్రధాని గిరిజాప్రసాద్‌ కోయిరాలా తమ పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను నేపాల్‌ రాజు జ్ఞానేంద్రకు అందజేసినట్టుగా తెలిసింది. కోయిరాలా రాజీనామాకు కారణాలను ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే తన రాజీనామాకు కారణం మావోయిస్టు తీవ్రవాదులే కారణమని కోయిరాలా రేడియో ప్రసంగంలో ప్రకటించారు.

గత కొంతకాలంగా కోయిరాలా ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్నది. ముఖ్యంగా రాజు బీరేంద్ర కుటుంబం ఊచకోత తర్వాత కోయిరాలా పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారయింది. కోయిరాలా తీవ్రమైన అవినీతి ఆరోపణలను ఎదుర్కుంటున్నారు. దేశంలో చెలరేగిపోతున్న మావోయిస్ట్‌ గెరిల్లాలను అదపుచేసే విషయంలో కోయిరాలా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న ఆరోపణలు కూడా వున్నాయి. పైగా ప్రభుత్వంతో తాము చర్చలు జరపాలంటే కోయిరాలా రాజీనామా చేయాలని కూడా మావోయిస్టులు షరతు విధించారు. స్వల్ప విరామంతో ఆయన పదేళ్లపాటు ప్రధానిగా వున్నారు.

  • స్థానిక సంస్థలఫలితాలు-జిల్లాల వారీగా
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X