వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
15 ఏళ్ల కనిష్టస్థాయిలో పిసిల అమ్మకాలు
న్యూయార్క్:ప్రపంచవ్యాప్తంగా పిసిల అమ్మకాలు ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికంలో గణనీయంగా పడిపోయాయి. గత పదిహేనేళ్ల కనిష్ట స్థాయిని పిసిల అమ్మకాలు తాకినట్టుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పిసిల ఉత్పత్తిరంగంలో కెపాసిటీ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిందని, ఉత్పత్తుల నిల్వలు పేరుకుపోయాయని పోటీ వల్ల ధరలపై తీవ్రమైన వత్తిడి ఏర్పడిందని ఈ పరిస్థితుల్లో వ్యాపారం ప్రమాదకరంగా మారిందని ఐబిఎం వంటి సంస్థలే వాపోతున్నాయి.
ప్రపంచంలో ఉత్పత్తయ్యే పిసీల్లో 80 శాతం పీసీలకు మైక్రో ప్రాసెసర్లను సప్లయ్ చేసే ఇంటెల్ కూడా పరిస్థితి నిరాశజనకంగా వున్నట్టుగా చెబుతున్నది. ద్వితీయ త్రైమాసికం కంటే తృతీయ త్రైమాసికంలో అమ్మకాలు మరింత పడిపోయే ప్రమాదం వున్నదన్న భయం పరిశ్రమ వర్గాల్లో కనిపిస్తున్నది.
Comments
Story first published: Monday, July 23, 2001, 23:53 [IST]