వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రక్షణ మంత్రిగా కృష్ణంరాజు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన బిజెపి నేత, సినీ నటుడు కృష్ణరాజును రక్షణ శాఖసహాయ మంత్రిగా నియమించారు. ఇప్పటి వరకు ఆయన విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా వున్నారు. ఆదివారం జరిగిన క్యాబినెట్‌విస్తరణ అనంతరం ప్రధాని వాజ్‌ పేయి మంత్రుల శాఖలలో కూడాస్వల్ప మార్పులు చేశారు. క్యాబినెట్‌ మంత్రిగా ఆదివారం ప్రమాణం చేసిన అజిత్‌ సింగ్‌ కు ఇప్పటి వరకు నితీష్‌ కుమార్‌ అదనపు బాధ్యతగా నిర్వర్తిస్తున్న వ్యవసాయ శాఖను కేటాయించారు.

వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా వున్న ఓమర్‌ ఫరూఖ్‌ ను విదేశాంగ శాఖకు మార్చారు.రైల్వే శాఖ సహాయ మంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ ను వాణిజ్య శాఖకు మార్చారు.

ఇది ప్రమోషన్‌ఃకృష్ణంరాజు
విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా వున్న తనను రక్షణ శాఖకు మార్చడం ప్రమోషన్‌ వంటిదని కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఆదివారం నర్సాపురంలో ఆయనవిలేకరులతో మాట్లాడుతూ రక్షణ, విదేశాంగ శాఖలు నిర్వహిస్తున్న జస్వంత్‌ సింగ్‌ తన బాధ్యతను మరింతపెంచారని ఆయన వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X