వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒరిస్సాలో ప్రధాని పర్యటన
భువనేశ్వర్: తుఫాను, వరదల తాకిడితో అతలాకుతలమైన ఒరిస్సాలో పరిస్థితిని అంచనావేయడానికి ప్రధాని వాజ్పేయి ఈ నెల 29న స్వయంగా ఎరియల్ సర్వేచేస్తున్నారు. ఆదివారం ఉదయమే ఢిల్లీ నుంచి బయలు దేరుతున్న ప్రధాని వైమానిక దళం ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ వెళ్లుతున్నారు.
మహానది డెల్టాలో వరదల తాకిడికి గురైన ప్రాంతాలను ఆయన హెలీకాప్టర్ నుంచి సందర్శిస్తారు. ఈ పర్యటన తర్వాత రాజ్భవన్లో వరద సహాయం పనులపై ఏర్పాటైన సమావేశంలో పనుల తీరును ఆయన సమీక్షిస్తారు. తర్వాత విలేకరుల సమావేశంలో కూడా మాట్లాడుతారు. ఒరిస్సాకు చెందిన నలుగురు కేంద్ర మంత్రులు కేంద్ర కేబినెట్ సెక్రటరి, వ్యవసాయ శాఖ సెక్రటరీ కూడా ప్రధానితో పాటు ఒరిస్సాను సందర్శిస్తున్నారు. ఒరిస్సా చరిత్రలోనే అత్యంత భయానక ఘట్టంగా ఈ వరదలను పరిశీలకులు చెబుతున్నారు. 30 జిల్లాల్లోని 24 జిల్లాల్లో ఈ వరదలు బీభత్సం సృష్టించాయి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!