వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగారెడ్డి జడ్పీ దేశంకైవసం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ కుమ్ములాట మధ్య అందరూ ఊహిస్తున్నట్టుగానే రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి తెలుగుదేశం పార్టీ కైవసమయింది. చైర్మన్‌ పదవిని దక్కించుకోవడంతో పాటు మిత్రపక్షమైన బిజెపికి వైస్‌ చైర్మన్‌ పదవిని కూడా తెలుగుదేశం పార్టీ కట్టబెట్టగలిగింది.

రంగారెడ్డి జడ్‌పి చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ కుత్భుల్లాపూర్‌ జడ్‌పిటిసి సభ్యుడు కాసాని జ్ఞానేశ్వర్‌, ఉపాధ్యక్షునిగా బిజెపికి చెందిన నందకుమార్‌ యాదవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు జరిగినశనివారం నాడు రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయం వద్ద అసాధరణ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఉదయం నుంచి జిల్లా పరిషత్‌ కార్యాలయానికి వెళ్లే రహదారిపై పెద్ద సంఖ్యలో మొహరించారు.కాంగ్రెస్‌, తెలుగుదేశం, బిజెపి సభ్యులు ఉదయం పదిగంటల కల్లా కార్యాలయానికి చేరుకున్నారు.

ప్రమాణ స్వీకారోత్సవంలో గొడవ ప్రారంభించిన కాంగ్రెస్‌ సభ్యులను పోలీసులు బయటకు పంపించివేశారు. తర్వాత కోరం వుండటంతో కోఆప్టెడ్‌ సభ్యుల నామినేషన్‌ కార్యక్రమం ముగించారు. మధ్యాహ్నం రెండు గంటలకు చైర్మన్‌ ఎన్నిక జరుగుతుందని ఎన్నికల అధికారిగా వున్న జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. తమ పార్టీ జడ్‌పిటిసి సభ్యుడు కంజెర్ల భాస్కర్‌ జాడ తెలిపే వరకు ఎన్నికలు జరగడానికి వీలులేదని కాంగ్రెస్‌ సభ్యులు తీవ్రస్థాయిలో అధికారులతో ఘర్షణకు దిగారు. అయితే భాస్కర్‌ సమావేశం హాలుకు చేరుకుంటే తాము భద్రత క ల్పిస్తామని భాస్కర్‌ను వెతికి పట్టుకుని హాలుకు తేవల్సిన బాధ్యత తమది కాదని అధికారులు ప్రకటించడంతో కాంగ్రెస్‌ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నెల 23న జరగాల్సిన జడ్‌పి చైర్మన్‌ ఎన్నిక కోరం లేక వాయిదా పడిన విషయం విదితమే. రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నిక జరిగిన తీరుపై కాంగ్రెస్‌ నేతలు అధికార పార్టీని తీవ్రంగా దుయ్యబట్టారు. అధికార పార్టీ తమ పార్టీ సభ్యుని నిర్బంధించడంతో పాటు అధికారులను తన పావులుగా వాడుకుని చైర్మన్‌ పదవిని కైవసం చేసుకున్నదని వారు విరుచుకుపడ్డారు. టిఆర్‌ఎస్‌ను కూడా కాంగ్రెస్‌ తీవ్రంగా విమర్శించారు. టిఆర్‌ఎస్‌తో చేతులు కలిపితే అలవోకగా హస్తగతమయ్యే చైర్మన్‌ పదవని కాంగ్రెస్‌ చేజేతులా జారవిడుచుకున్నదని పరిశీలకులు అంటున్నారు. రంగారెడ్డితో కలసి ఇప్పటికి 12 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది. కాంగ్రెస్‌ 7 జిల్లాలను టిఆర్‌ఎస్‌ ఒక్క జిల్లాను దక్కించుకున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X