వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోబెల్‌ శాంతికి ముషారఫ్‌పేరు

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ నేత జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ పేరును అత్యున్నత శాంతి పురస్కారం నోబెల్‌ శాంతి బహుమతికి సిఫారసు చేశారు. ఇంటర్నేషనల్‌ హ్యూమన్‌రైట్స్‌ ఆబ్జర్వర్‌ అనే ప్రభుత్వేతర సంస్థ ఆయన పేరును ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ బహుమతికి ప్రతిపాదించింది.

ఉపఖండంతో శాంతికోసం భారత్‌తో చర్చలు జరుపుతూ అవిశ్రాంతంగా కృషి జరుపుతున్న ముషారఫ్‌ ఈ పురస్కారానికి అన్ని విధాలుగా అర్హుడని ఆ సంస్థపేర్కొంది. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చిన ముషారఫ్‌ కీలకమైన పదవులన్నింటినీ సైనికాధికారులతో నింపుతూవిమర్శల పాలవుతుండగా శాంతిబహుమతికి ఆయనపేరును సిఫారసు చేయడం విశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X