• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హైదరాబాద్‌లోపేలుళ్లకు కుట్ర

By Staff
|

హైదరాబాద్‌: కాశ్మీర్‌ ఉగ్రవాద సంస్థ హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌తో సంబంధం వున్న ఆరోపణలపై హైదరాబాద్‌లో గత కొంతకాలంగా నివాసం వుంటున్న ఎనిమిది మంది కాశ్మీరీ యువకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో హిజుబుల్‌ ముజాహిదీన్‌ ముఖ్యనాయకుడు అల్తాఫ్‌ హుసెన్‌ సోదరుడు కూడా వున్నట్టు పోలీసులు చెప్పారు. నీరంతా ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ వేరువేరు ప్రాంతాల్లో వున్నారు.

అరెస్టు సందర్భంగా అనుమానాస్పదమైన పత్రాలుగానీ, మారణాయుధాలు గానీ వారి వద్ద లభించలేదు. ఇంటరాగేషన్‌ తర్వాత గానీ వారికి ఉగ్రవాద సంస్థతో సంబంధం వున్నదీ లేనిది తెలియదని పోలీసులుఅంటున్నారు.

ఇదిలా వుండగా రాజకీయ ప్రముఖులను హతమార్చడానికి, దేశ రాజధానిలోని ప్రధాని కార్యాలయం, పార్లమెంట్‌ భవనం, రాష్ట్రపతి భవన్‌, సేనాభవన్‌పై ఆత్మాహుి దళాలతో దాడి చేయించడానికి ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లోపేలుళ్లతో విధ్వంసం సృష్టించడానికి ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజుబుల్‌ ముజాహదీన్‌, స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా పన్నిన అతిపెద్ద కుట్రని భగ్నం చేసినట్టు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఈ కుట్రలకు సంబంధించి హైదరాబాద్‌, ఢిల్లీ, మహారాష్ట్రలోని జల్‌గావ్‌, ఉత్తరప్రదేశ్‌లోని కన్పూర్‌లలో గత రెండు రోజుల్లో 23 మందినిఅరెస్టు చేశారని కూడా హోంశాఖ ప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X