వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీవ్రవాదాన్ని అణిచేస్తాంః అద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః కాశ్మీర్‌ లో తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి ఎల్‌.కె. అద్వానీ గురువారం లోక్‌ సభకు హామీ ఇచ్చారు. జమ్ము ఊచకోతపై సావధాన తీర్మానానికి సమాధానం ఇస్తూ కాశ్మీర్‌ అంతటాసైనిక చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చర్య వల్లసైన్యానికి ప్రత్యేక అధికారాలు చేకూరతాయని, సీమాంతర ఉగ్రవాదాన్ని అణచి వేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అద్వానీ అన్నారు.

అద్వానీ ప్రకటన పట్ల ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. జమ్మూలో నరమేధాన్ని అదుపుచేయడంలోవిఫలం అయిన అద్వానీ తక్షణం హోం మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి.అందుకు అద్వానీ సమ్మతించనందుకు నిరసనగా కాంగ్రెస్‌ తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు లోక్‌ సభ నుంచి వాకౌట్‌ చేశాయి.

కల్లోలకాశ్మీర్‌లో సరికొత్త వ్యూహం
కాశ్మీర్‌లో భద్రతాదళాలు ఇకపై తనఎత్తగడలు, వ్యూహాలను సమూలంగా మార్చనున్నట్టుగాకేంద్ర హోం మంత్రి ఎల్‌కె అద్వానీ గురువారం నాడు లోక్‌సభలోచెప్పారు. బుధవారం నాడు జరిగిన అత్యున్నత స్థాయిసమావేశంలో కల్లోల ప్రాంతాల చట్టాన్నికాశ్మీర్‌లోయలో లఢక్‌ మినహా మిగిలిన ప్రాంతాలకువిస్తరించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన లోక్‌సభకుతెలియజేశారు.

కాల్పులవిరమణ ఎత్తివేత తర్వాత తీవ్రవాదులు పెద్దఎత్తున చెలరేగి బీభత్సం సృష్టిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు అమాయకుల ప్రాణరక్షణకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలను తీసుకుంటుందని ఆయన చెప్పారు. దళాల మొహరింపు, తీవ్రవాదుల ఏరివేత చర్యల్లో మార్పులు చేపట్టాల్సిందిగా రాష్ట్రంలోని భద్రతా దళాలను ఆదేశించినట్టుగా ఆయన చెప్పారు. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదం అణిచివేతకు అన్ని పక్షాల సహకారాన్ని ప్రభుత్వం కోరుతున్నదని ఆయన సభకు చెప్పారు.

కల్లోలిత ప్రాంతాల చట్టంవిస్తరణ వల్ల రాష్ట్రంలో భద్రతాదళాలకువిశేష అధికారాలు లభిస్తాయి. నిర్దాక్షిణ్యంగా టెర్రరిస్టులను అణిచివేసే అవకాశం లభిస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X