వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్‌ విమానసర్వీసుల్లో కోత

By Staff
|
Google Oneindia TeluguNews

ఖాట్మాండుః విమానాల కొరత కారణంగా యూరప్‌, సింగపూర్‌కు విమాన సర్వీసులను రద్దు చేయాలని రాయల్‌ నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌ నిర్ణయించింది. ముంబాయి, బెంగుళూరు, కల్‌కత్తా, న్యూఢిల్లీ విమాన సర్వీసులను కూడా తగ్గిస్తున్నారు. బాంకాక్‌, జపాన్‌ విమాన సర్వీసులు మాత్రం యథాతథంగా నడుస్తాయి.

అవినీతి అరోపణలు వెల్లువెత్తడంతో ఆస్ట్రియన్‌ విమానయాన సంస్థ లౌడ్‌ఎయిర్‌, చైనా విమానయాన సంస్థ వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌తో కుదుర్చుకున్న లీజు ఒప్పందాన్ని రాయల్‌ నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌ రద్దు చేసుకున్నది. ఒప్పందాల రద్దు దరిమిలా విమానాల కొరత ఏర్పడటంతో సర్వీసులను కుదించాలని నిర్ణయించింది. ఫ్రాంక్‌ఫర్ట్‌, పారిస్‌, లండన్‌ సర్వీసులను సెప్టెంబర్‌ ఒకటినుంచి నిలిపివేస్తున్నట్టుగా తెలిపారు. ప్రధాని పదవికి కోయిరాలా రాజీనామా చేయడానికి విమానాల లీజులో అవినీతి చోటుచేసుకున్న ఆరోపణలు కూడా ఒక కారణమన్న విషయం విదితమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X