వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరీ కొసరాజు వెంకటేశ్వరరావు?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః కృషి బ్యాంకు పుట్టిమునగడంతో వార్తల్లోకి వచ్చిన బ్యాంకు చైర్మన్‌ కొసరాజు వెంకటేశ్వరరావు నేపథ్యంపై అనేక రకాల వార్తలు వెలువడుతున్నాయి. హైదరాబాద్‌తో అసలేమాత్రం సంబంధం లేని వెంకటేశ్వరరావు కృష్ణాజిల్లాకు చెందినవాడని తెలిసింది.

దశాబ్ద కాలంలోనే సుడితిరిగి కోట్లకు పడగెత్తిన వెంకటేశ్వరరావు దశాబ్దం క్రితంవిశాఖ వీధుల్లో ఉపాధికోసం గాలిస్తున్న నిరుద్యోగిఅంటే నమ్మశక్యం కాదు. కృష్ణాజిల్లా వెంట్రప్రగడ నుంచివిశాఖ వెళ్లిన వెంకటేశ్వరరావు కొంతకాలం మెడికల్‌ రిప్రజెంటేటీవ్‌గా పనిచేశారు. ఆ తర్వాత స్టాక్‌మార్కెట్‌లోరాత్రికిరాత్రే కోట్లాది రూపాయలు సంపాదించవచ్చనే ఆశతో గాయత్రిషేర్స్‌ అనే సంస్థను 1993లో ప్రారంభించాడు.

అప్పట్లో స్టాక్‌మార్కెట్‌ బూమ్‌ కొనసాగుతుండటంతో వెంకటేశ్వరరావు రొట్టెవిరిగి నేతిలో పడినట్టయింది. అడ్డగోలుగా షేర్ల దందా చేసిన వెంకటేశ్వరరావు మార్కెట్‌ పతనంతో దివాళాతీసినట్టు తెలిసింది. క్లయింట్లకు వివిధ సంస్థలకు సుమారు 30 లక్షల రూపాయల దాకా బకాయిపడిన వెంకటేశ్వరరావు చెప్పాపెట్టకుండావిశాఖలో మాయమై హైదరాబాద్‌లో తేలాడు. మూడేళ్ల క్రితం ప్రభుత్వ ఉదారవాద విధానాల వల్ల పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చిన సహకార బ్యాంకులను గమనించిన వెంకటేశ్వరరావు తాను కొత్త అవతారం ఎత్తాడు. సన్నిహిత బంధువులను కలుపుకుని అధికారవర్గాల్లో తనకు కావల్సిన వారి ద్వారా చకచకా పాపులు కదిపి మూడునెలల్లో లైసెన్స్‌ సంపాదించి కృషి బ్యాంకును ప్రారంభించాడు.

ఈ బ్యాంకు ప్రచారంపై లక్షలాది రూపాయలను గుప్పించాడు. మెర్సిడెస్‌ బెంజ్‌ కారులో ఈమధ్యవిశాఖ వెళ్లిన వెంకటేశ్వరరావు చూసిన ఆయన పాత పరిచయస్తులు నివ్వెరపోయినట్టుగా తెలిసింది. దివాళా తీసి చేతిల్లో చిల్లిగవ్వలేని స్థితిలో ఊరువదిలి వెళ్లిన వెంకటేశ్వరరావు బెంజికారులో రావడం ఖరీదైన దుస్తుల్లో అట్టహాసాన్ని ప్రదర్శించడం వారిని ఆశ్చర్యపరిచింది.

ఎంత సహకార బ్యాంకును ప్రారంభించిన ఇంతస్వల్పకాలంలో కోట్లకు పడగెత్తడం విస్మయపరిచేవిషయమే. ఇదిలా వుండగా తన స్వంతగ్రామంలో కూడా వెంకటేశ్వరరావు కోటి రూపాయలతోబ్రహ్మాండమైన ఇల్లు కట్టినట్టుగా చెబుతున్నారు. బ్యాంకు నిధులను సొంతానికి ముఖ్యంగా స్టాక్‌మార్కెట్‌ కార్యకలాపాలకు వినియోగించినట్టుగా చెబుతున్నారు. దీనిపై పూర్తి దర్యాప్తు జరిపితే తప్ప నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదు. ఈ మధ్య జరిగిన అమెరికాలోని ప్రవాస భారతీయుల సంఘం తానా సమావేశానికి కూడా వెంకటేశ్వరరావుహాజరై పెద్దఎత్తునే డిపాజిట్లు సమీకరించినట్టుగా చెబుతున్నారు. ఈవిషయానికి సంబంధించి ఎన్‌ఆర్‌ఐలనుంచి మాత్రం ఫిర్యాదులు ఏమీఅందలేదని స్థానికి పోలీసులు చెబుతున్నారు.

  • కృషి ఎండి అరెస్టు
  • కృషిబాంకుకు లిక్విడేషనే మార్గం
  • సంక్షోభంలో కృషి బ్యాంక్‌
  • ఆర్‌బిఐదే అసలు పాపం.....

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X