• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రశాంతంగా పార్లమెంటు సమావేశాలు

By Staff
|

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. డిఎంకె సభ్యులు సంయమనం పాటించడంతో పార్లమెంటు సమావేశాలకు అంతరాయం కలుగలేదు. తమిళనాడులోని పరిస్థితిపై రెండు రోజులుగా పార్లమెంటు సమావేశాల్లో గందరగోళం సృష్టిస్తూ వచ్చిన డిఎంకె సభ్యులు గురువారం పార్లమెంటు ఉభయ సభల్లోనూ తమిళనాడు పరిస్థితిని ప్రస్తావించలేదు. డిఎంకె సభ్యులు బుధవారం కేంద్ర హోంమంత్రి ఎల్‌.కె. అద్వానీని కలిశారు. అన్నాడియంకె ప్రభుత్వంపై చర్య తీసుకుంటామని అద్వానీ హామీ ఇవ్వడంతో వారు సంతృప్తి చెందారు.

సభలో డిఎంకె సభ్యులు వ్యవహరిస్తున్న తీరును రాజ్యసభ ఉపాధ్యక్షురాలు నజ్మా హెప్తుల్లా తప్పు పట్టారు. రాష్ట్రాలకు సంబంధించినఅంశాలను పార్లమెంటులో ప్రస్తావించడం సరి కాదని ఆమె అన్నారు. రాష్ట్రాలకు సంబంధించినఅంశాలను పార్లమెంటులో ప్రస్తావిస్తూ పోతే అటువంటి వాటికి అంతు వుండదని ఆమె అభిప్రాయపడ్డారు. తమిళనాడులోని శాంతిభద్రతలఅంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తే రాష్ట్ర అసెంబ్లీ అవసరం ఏమిటని ఆమె అడిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X