• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లోక్‌సభలో యుటిఐ దుమారం

By Staff
|
న్యూఢిల్లీః యుటిఐ మాజీ చైర్మన్‌ సుబ్రహ్మణ్యంను తమిళనాడు నేత జయలలిత సిఫారసుపైనే అప్పట్లో ఆ పదవిలో నియమించినట్టుగా ఎన్‌డిఎ కన్వీనర్‌ జార్జ్‌ ఫెర్నాండెజ్‌ చేసిన ప్రకటన గురువారం నాడు లోక్‌సభలో దుమారం సృష్టించింది. నిబంధనల ప్రకారమే సుబ్రహ్మణ్యం నియామకం జరిగిందని ఆర్ధిక మంత్రి సిన్హా వివరణ ఇచ్చిన తర్వాత గానీ విపక్ష సభ్యులు శాంతించలేదు.

తొలుత కాంగ్రెస్‌ సభ్యుడు ప్రియరంజన్‌దాస్‌ మున్షి నాయకత్వంలో జీరో ఆవర్‌లో కాంగ్రెస్‌ సభ్యులు ఈఅంశాన్ని లేవనెత్తారు. సుబ్రహ్మణ్యం నియామకం జయసిఫారసు మేరకే జరిగిందంటూ జార్జ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రిపై జార్జ్‌ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తూ వారు సభ మధ్యలోకి దూసుకువచ్చారు. యుటిఐ చైర్మన్‌గా సుబ్రహ్మణ్యంను నియమించాల్సిందిగా కోరుతూ ప్రధాని వాజ్‌పేయికి జయలలిత లేఖరాసిందని ప్రకటించిన సభను తప్పు దారి పట్టించిన జార్జ్‌ ఫెర్నాండెజ్‌పై ప్రభుత్వం చర్య తీసుకోవాలని మున్షి డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ నేతలతో ఎఐఎడిఎంకె సభ్యులు కూడా గొంతుకలపడంతో సభలో తీవ్రస్థాయిలో గందరగోళం చెలరేగింది. అదే సమయంలో అధికార పక్షం సభ్యులనుంచి కూడా నినాదాలుఅరుపులు ప్రారంభమయ్యాయి. సభ్యులను శాంతింప జేయడానికిస్పీకర్‌ బాలయోగి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ దశలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ లేచి, కాంగ్రెస్‌ సభ్యుడు దాస్‌మున్షి ఈఅంశంపై సెక్షన్‌ 40 కింద నోటిసు ఇస్తే సరిపోయేదని నేరుగా ప్రస్తావించి లేని చిక్కులు తెచ్చిపెట్టారనివిమర్శించారు. ప్రమోద్‌ మహాజన్‌ విమర్శలను తిప్పికొడుతూ మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

మంత్రికన్నా పార్లమెంట్‌లో తనకు ఎక్కువగా అనుభవం వున్నదని మంత్రి చెబుతున్న నిబంధన కేవలం ప్రభుత్వ వ్యవహారాలను ప్రస్తావించే సమయంలో మాత్రమే వర్తిస్తుందని చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు.ఈ దశలో గొడవ మరింత ముదరడంతో ముందు ప్రకటన చేయడానికి ససేమిరా నిరాకరించిన ఆర్ధిక మంత్రి యశ్వంత్‌సిన్హా లేచి సుబ్రహ్మణ్యం నియామకంలో ప్రభుత్వం నియమనిబంధనలకు అనుగుణంగా మాత్రమే వ్యవహరించిందని సిఫారసులు, వత్తిళ్లు పనిచేయలేదని చెప్పడంతో ప్రతిపక్షాలు శాంతించాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more