• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సిటీ పచ్చదనానికి మరోరూ. 220 కోట్లు

By Staff
|

హైదరాబాద్‌: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాలను సుందరంగా తీర్చి దిద్దేందుకు నెదర్లాండ్స్‌ మరో 220 కోట్ల రూపాయలు మంజూరు చేయనుంది. అదనపు నిధుల విడుదలకు నిధులు విడుదల చేసేందుకు నెదర్లాండ్స్‌అంగీకరించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. హైదరాబాద్‌ నగరాభివృద్ధి సంస్థ (హుడా) మంగళవారం చేపట్టిన ఒక రోజు ఒక లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. క్లీన్‌ సిటీ- గ్రీన్‌ సిటీ పథకం అమలుకు నెదర్లాండ్స్‌ ఇప్పటికే నిధులు విడుదల చేసింది.

జంటనగారాల్లో ఇప్పటి వరకు ఉన్న 15 శాతం మొక్కలను వచ్చే మూడేళ్లలో 30 శాతానికిపెంచేందుకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే మూడేళ్లలో 30 వేల హెక్టార్లలో మొక్కలు నాటనున్నట్లు, జంటనగారాల్లో, పరిసరాల్లో వున్న 80 చెరువులను మరమ్మతు చేయనున్నట్లు,సరస్సులను పార్క్‌లుగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన చెప్పారు.సరస్సు గట్లపై నివసించేవారికి ప్రత్యామ్నాయం చూపుతామని ఆయన చెప్పారు.

జంటనగరాల శివార్లలో పారిశ్రామిక కాలుష్యం తీవ్రంగా వుందని, దీన్ని తగ్గించే చర్యలు చేపట్టడం అవసరమని హోం మంత్రి టి. దేవేందర్‌ గౌడ్‌ అన్నారు.

మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమానికి వేలాది మంది పాఠశాలవిద్యార్థులను రప్పించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి 8 గంటలకే కార్యక్రమ స్థలానికి చేర్చడంతోవిద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఒక విద్యార్థి కాలిపై గడ్డపార పలుగు పడడంతో గాయపడ్డాడు. అతడ్ని ఆస్పత్రిలో చేర్చారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more