• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హర్యానాలో ఏడుగురి దారుణహత్య

By Staff
|

హిసార్‌ః హర్యానా మాజీ ఎమ్మెల్ల్యేతో ఆయన కుటుంబ సభ్యులందరినీ గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. 1996లో హర్యానాఅసెంబ్లీకి ఎన్నికైన రేలు రాం పునియా లిటాని గ్రామంలో వున్న ఫాం హౌస్‌ లో వుంటున్నారు. ఆయన భార్య, కుమార్తె ప్రియాంక, కుమారుడు సునీల్‌, అతని భార్య, ముగ్గురు పిల్లలను దుండగులు ఇనపరాడ్లతో కొట్టి దారుణంగా చంపారు.

పునియా గురువారం రాత్రి తన ఫామ్‌ హౌస్‌ లో బర్త్‌ డే పార్టీ నిర్వహించారు. ఆ తరువాత దుండగులువీరిని ఇనపరాడ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. శుక్రవారం కొందరు గ్రామస్థులు అనుమానం వచ్చి తలుపులు తీసి చూడగా రక్తపు మడుగులో పడివున్న ఏడు మృత దేహాలను కనుగొన్నారు. పునియా మరో కూతురు కొనఊపిరితో కొట్టు మిట్టాడుతున్నారు. అమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X