వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకటేశ్వరరావు దోబూచులాట

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః కృషి బాంక్‌ చైర్మన్‌ వెంకటేశ్వరరావు అరెస్ట్‌ విషయంలో పోలీసులు సీరియస్‌గా వ్యవహరించడం లేదనే ఆరోపణలు బలంగా వినవస్తున్నాయి. నగరంలోనూ, నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వుంటూ పోలీసులతో వెంకటేశ్వరరావు దోబుచులాడుతున్నారని డిపాజిటర్లు అంటున్నారు.

పోలీసులు గట్టిగా తలుచుకుంటే వెంకటేశ్వరరావునుఅరెస్టు చేయడం లెక్కలోనిది కాదని అయితే వారు ఎందుకో ఈవిషయంలో నాన్పుడు ధోరణి అవలంభిస్తున్నారని వారుఅంటున్నారు.

వెంకటేశ్వరరావు ఒక్కన్ని పట్టుకోలేక పోతున్నారంటే నమ్మవచ్చు, కానీ పదిమంది డైరెక్టర్లలో ఒక్కరూ దొరకడం లేదనేవిషయం నమ్మశక్యంగా లేదని వారు అంటున్నారు. బ్యాంకు వైస్‌ చైర్మన్‌గా వున్న వెంకటేశ్వరరావు సోదరుడు వేణుగోపాలరావు మాత్రం పోలీసులకు లొంగిపోయాడు. లొంగిపోయిన వేణుగోపాలరావు నుంచి డిపాజిటర్లు పనికివచ్చే నయాపైసమందం సమాచారం కూడా పోలీసులు రాబట్టలేకపోయారు.

ఈ కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని సిఎల్‌పి కూడా ఆరోపిస్తున్నది. సిఎల్‌పి నేతలు గురువారం నాడువిలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసును ఎటూ తేలకుండా చేసేందుకే పనిగట్టుకుని సిఐడికిఅప్పగించారని ఆరోపించారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తే కృషి లోగుట్టు పూర్తిగా బయటపడుతుందని వారుఅంటున్నారు.

దేవాదాయశాఖ డిపాజిట్‌ కోటి
మావాడికే పాపమూ తెలియదు
కృషిమాజీ చైర్మన్‌ ఆస్తుల జప్తు
పట్టుకుంటేఅయిదు లక్షలు

కృషిడిపాజిట్లకు బీమా లేదు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X